Kalki Movie | ఈసారి సల్మాన్, అమీర్ ఖాన్ వంతు

 

2024-07-08 05:55:11.0

https://www.teluguglobal.com/h-upload/2024/06/29/1340324-kalki.webp

Kalki Movie – కల్కి సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు సల్మాన్, అమీర్ సినిమాల్ని గురిపెట్టింది.

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా దేశవ్యాప్తంగా దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో టాప్-5లో చేరిన ఈ సినిమా, దేశీయంగా కూడా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే, అత్యథిక వసూళ్లు సాధించిన టాప్-10 సినిమాల లిస్ట్ లోకి చేరింది.

ఇప్పటికే ఎన్నో సినిమాల్ని దాటేసి టాప్-10లో చేరిన ఈ సినిమా, ఇప్పుడు సల్మాన్, అమీర్ ఖాన్ సినిమాలపై కన్నేసింది. సల్మాన్ నటించిన భజరంగీ భాయ్ జాన్ దేశవ్యాప్తంగా 870 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది, ఇక అమిర్ నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా 835 కోట్లు కలెక్ట్ చేసింది.

ఈ రెండు సినిమాల్ని త్వరలోనే కల్కి క్రాస్ చేయబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు 800 కోట్ల రూపాయలకు పైగా సాగుతున్నాయి. మరో 2 రోజుల్లో సల్మాన్, అమీర్ రికార్డులు చెల్లాచెదురుకాబోతున్నాయి. అమీర్ నటించిన దంగల్ సినిమాను దాటాలంటే, కల్కి సినిమా ఇండియా అంతటా స్టడీగా మరో 10 రోజులు ఆడాల్సి ఉంటుందని ట్రేడ్ భావిస్తోంది.

ఇండియాలో టాప్-10 హయ్యస్ట్ గ్రాసర్ సినిమాలివే..

1. దంగల్ – రూ. 1950 కోట్లు

2. బాహుబలి 2 – రూ. 1810 కోట్లు

3. ఆర్ఆర్ఆర్ – రూ. 1290 కోట్లు

4. కేజీఎఫ్ 2 – రూ. 1230 కోట్లు

5. జవాన్ – రూ. 1160 కోట్లు

6. పటాన్ – రూ. 1050 కోట్లు

7. యానిమల్ – రూ. 950 కోట్లు

8. భజరంగీ భాయ్ జాన్ – రూ. 870 కోట్లు

9. సీక్రెట్ సూపర్ స్టార్ – రూ. 835 కోట్లు

10. కల్కి – రూ. 800 కోట్లు

 

Kalki Movie,Salman Amir Khan Movies,Prabhas