2024-07-27 14:28:13.0
https://www.teluguglobal.com/h-upload/2024/07/13/1344054-kalki-1.webp
Kalki Hindi Version – కల్కి సినిమాకు ఉత్తరాదిన మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇంతకీ ఈ సినిమా ఏ స్థానంలో ఉంది.
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా హిట్టయింది. అయితే ఇది అధిగమించాల్సిన రికార్డులు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరాదిన కల్కి ఇంకా మూడో స్థానంలోనే ఉంది.
తాజాగా 4 వారాల రన్ పూర్తి చేసుకుంది కల్కి. ఈ సినిమా హిందీ వెర్షన్ కు 280 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. అయితే రెండో స్థానంలో ఉన్న కేజీఎఫ్2 ను బ్రేక్ చేయాలంటే ఇది సరిపోదు. మరో వంద కోట్లు వచ్చినా కేజీఎఫ్2 ను క్రాస్ చేయడం కష్టమే.
నార్త్ లో డబ్బింగ్ సినిమాల టాప్-10 వసూళ్లు ఇలా ఉన్నాయి..
1. బాహుబలి 2 – రూ. 511 కోట్లు
2. కేజీఎఫ్ 2 – 434 కోట్లు
3. కల్కి – 280 కోట్లు
4. ఆర్ఆర్ఆర్ – 274 కోట్లు
5. 2.o – 189 కోట్లు
6. సలార్ – 153 కోట్లు
7. . సాహో – 143 కోట్లు
8. బాహుబలి 1 – 118 కోట్లు
9. పుష్ప – 108 కోట్లు
10. కాంతార – 79 కోట్లు
Kalki,Hindi Version,Prabhas,Deepika Padukone