Kavya Thapar | అలా ఛాన్స్ మిస్సయింది

 

2024-08-06 15:56:47.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/06/1350274-kavya-thapar.webp

Kavya Thapar – కావ్య థాపర్ ఆసక్తికర విశేషాలు బయటపెట్టింది. ఇస్మార్ట్ శంకర్ కు ఆమెకు సంబంధం ఉంది.

ఎవరికి ఎప్పుడు ఎలా అవకాశం వరిస్తుందో చెప్పలేం. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వింతలు మరీ ఎక్కువ. ఇది కూడా అలాంటి ఘటనే. స్వయంగా హీరోయిన్ కావ్య థాపర్ వెల్లడించిన ఆ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటో చూద్దాం..

హీరోయిన్ అవకాశాల కోసం కావ్య థాపర్ గట్టిగా ప్రయత్నిస్తున్న రోజులవి. అదే టైమ్ లో ఇస్మార్ట్ శంకర్ కోసం కొత్త హీరోయిన్ల కోసం వెదుకుతున్నాడట పూరి జగన్నాధ్. వెంటనే ఆఫీస్ కు వెళ్లి ఆడిషన్ ఇచ్చింది కావ్య థాపర్.

కానీ ఇస్మార్ట్ శంకర్ లో ఆమెకు అవకాశం దక్కలేదు. అయితే అప్పుడిచ్చిన ఆడిషన్ ఇప్పుడు పనికొచ్చిందని అంటోంది. ఇస్మార్ట్ శంకర్ కు ఆడిషన్ ఇస్తే, డబుల్ ఇస్మార్ట్ లో నటించే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే ఇది కూడా ఏమంత సింపుల్ గా జరగలేదని చెబుతోంది.

“డబుల్ ఇస్మార్ట్ కోసం మరోసారి ఆడిషన్ ఇచ్చాను. పూరి జగన్నాధ్, ఛార్మికి నచ్చింది. అయితే ఆ టైమ్ లో నాకు యాక్సిడెంట్ అయింది. బెడ్ రెస్ట్ వల్ల కొంచెం బరువు పెరిగాను. వెయిట్ తగ్గమని చెప్పారు. 2 నెలలు కష్టపడి వెయిట్ తగ్గాను.”

ఇలా తను యాక్సిడెంట్ కు గురైన విషయాన్ని బయటపెట్టింది. రామ్ తో మొదటి రోజు షూటింగ్ లోనే టెన్షన్ తో అస్వస్థతకు గురైందంట కావ్య. నిర్మాత ఛార్మి దగ్గరుండి ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేసిందట.

ఇలా ఎన్నో బాధలు పడి, ఇంకెంతో కష్టపడి డబుల్ ఇస్మార్ట్ కోసం పనిచేశానంటోంది. అన్నట్టు ఈ సినిమాలో కావ్య థాపర్ కు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయంట. 

 

Kavya Thapar,double ismart,Ram Pothineni