2024-08-01 17:15:59.0
https://www.teluguglobal.com/h-upload/2023/07/14/795301-keerthy-suresh-1.webp
Keerthy Suresh – ప్రస్తుతం చాలా బిజీగా ఉంది కీర్తిసురేష్. అయినప్పటికీ శింబు సరసన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది.
అదేంటో కోలీవుడ్ లో చాలామంది హీరోయిన్లకు శింబు అంటే ఇష్టం. ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ లో మాంఛి రొమాంటిక్ గా ఉంటాడనే ఇమేజ్ ఉంది అతడికి. బహుశా, అందుకేనేమో హీరోయిన్లంతా శింబును ఇష్టపడతారు. ఇప్పుడీ లిస్ట్ లోకి కీర్తిసురేష్ కూడా చేరింది.
శింబుపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది కీర్తిసురేష్. వీలైతే అతడితో ఓ సినిమాలో నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. శింబుతో ఎందుకు నటించాలనుకుంటున్నారనే ప్రశ్నకు కీర్తిసురేష్ దగ్గర మంచి లాజిక్ ఉంది.
కోలీవుడ్ లో శింబు యాక్టింగ్ విలక్షణంగా ఉంటుందట. అతడి దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయంటోంది. శింబుతో ఒక్క సినిమా చేస్తే చాలు, చాలా నేర్చుకోవచ్చని చెబుతోంది కీర్తిసురేష్.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు-తమిళ సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటోంది. అయినప్పటికీ ఛాన్స్ దొరికితే శింబు పక్కన హీరోయిన్ గా నటించాలని ఉందంటూ ప్రకటించింది.
Keerthy Suresh,Simbu,New Movie