https://www.teluguglobal.com/h-upload/2023/07/04/500x300_791265-kia-seltos.webp
2023-07-04 09:36:24.0
Kia Seltos facelift | అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ (Kia Seltos facelift) మంగళవారం మార్కెట్లోకి వచ్చేసింది.
Kia Seltos facelift | అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ (Kia Seltos facelift) మంగళవారం మార్కెట్లోకి వచ్చేసింది. కియా సెల్టోస్‌కు భారత్‌లో భారీగా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కియా మోటార్స్ పది కార్లలో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న మోడల్స్‌లో సెల్టోస్ ఒకటి. దాదాపు 100 దేశాల్లో అత్యంత పాపులారిటీ గల ఎస్‌యూవీ కారు కియా సెల్టోస్. ఇతర కార్లలో లభించని ఫీచర్లన్నీ కియా సెల్టోస్‌లో ఉన్నాయి. 2019లో మార్కెట్‌లోకి వచ్చిన కియా సెల్టోస్.. అప్‌డేటెడ్ అవతార్‌లో కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది. కియా ఫేస్‌లిఫ్ట్ బుక్ చేసుకున్న కార్ల ప్రేమికులకు కే-కోడ్ ద్వారా కార్లు డెలివరీ ప్రారంభించనున్నది. ఈ నెల 14 నుంచి కార్ల ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అవుతాయి.

త్రీ ఇంజిన్ ఆప్షన్స్, 5 ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. మూడు ట్రిమ్ లైన్స్ – ఎక్స్-లైన్, జీటీ లైన్, టెక్ లైన్ ఇంజిన్ ఆప్షన్లు, ఎనిమిది కలర్ ఆప్షన్ల (రెండు మాట్టె గ్రాఫిక్ ఫినిష్ కలర్ ఆప్షన్లు) అందుబాటులో ఉంటుంది. కియా సెల్టోస్ 2019 ఆగస్టులో మార్కెట్లోకి వచ్చింది. భారత్ మార్కెట్లో అత్యధికంగా సేల్ అవుతున్న ఎస్‌యూవీ కార్లలో కియా సెల్టోస్. దేశీయ మార్కెట్లో 3.64 లక్షలకు పై చిలుకు, విదేశాల్లో 1.36 లక్షలకు పైగా అమ్ముడైంది.

ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్‌లో ఇంటిగ్రేట్ అయిన రీ డిజైన్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, స్లైట్‌లీ అప్‌డేటెడ్ సిగ్నేచర్ టైగర్ నోస్ అసెంట్స్ వంటి ఫీచర్లతో వస్తున్నది. 18 -అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, రేర్‌లో న్యూలీ డిజైన్డ్ ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, డ్యుయల్ ఎగ్జాస్ట్ టిప్స్ ఉన్నాయి. టాప్ స్పెషిపికేషన్ వేరియంట్లలో ఎలక్ట్రికల్లీ పవర్డ్ టెయిల్ గేట్ లభిస్తుంది.

ఇంటీరియర్‌గా బ్లాక్ / గ్రే లేదా బ్లాక్/ క్యామెల్ బ్రౌన్ డ్యుయల్ టోన్ ఇంటీరియర్ థీమ్స్‌తో వస్తున్నది. డ్యుయల్ 10.25అంగుళాల డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైనమెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కంట్రోల్డ్ పనోరమిక్ సన్ రూఫ్, 8-స్పీకర్ ప్రీమియం బోస్ ఆడియో సిస్టమ్, డ్యుయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ, ఎయిర్ ప్యూరిఫయర్, అంబియెంట్ లైటింగ్ విత్ ఎల్ఈడీ సౌండ్ మూడ్ లైట్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ విత్ 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు జత కలిశాయి.

1.5-లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 158 హెచ్‌పీ విద్యుత్, 253 ఎన్ఎం మ్యాక్స్ టార్చి వెలువరిస్తుంది. ఐదు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తుంది. మాన్యువల్, సెమీ -ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. 1.5 లీటర్ల ఫోర్ సిలిండర్ పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. 17 అటోనమస్ ఫీచర్లతోపాటు సేఫ్టీ కోసం అడాస్ 2.0 సిస్టమ్ కూడా లభిస్తుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లతో కూడిన అడాస్ వ్యవస్థ ఉంటుంది. 6-ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిస్కెంట్ కంట్రోల్, ఐసోఫిక్స్ యాంకరేజెస్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

పాత మోడల్ కియా సెల్టోస్ రూ.10.89 లక్షల నుంచి రూ.19.65 లక్షల మధ్య పలుకుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తున్న కారు కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ మాత్రమే. సెల్టోస్ కేవలం ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మాత్రమే కలిగి ఉంది. హ్యుండాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా మాత్రమే పనోరమిక్ సన్‌రూఫ్ కలిగి ఉన్నాయి.
Kia Seltos,Kia Seltos Facelift,KIA,SUV,Kia Seltos facelift Price,Kia Seltos Facelift Colors
Kia Seltos, Kia Seltos 2023, Kia Seltos SUV facelift, New Seltos SUV, 2023 Seltos facelift, Seltos facelift, Seltos facelift new features, Seltos facelift diffence from old, Seltos facelift price, Seltos facelift colors, Kia Seltos facelift images, కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, కియా, సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్
https://www.teluguglobal.com//business/kia-seltos-facelift-2023-launch-live-price-new-features-images-and-more-945141