https://www.teluguglobal.com/h-upload/2023/07/21/500x300_798255-kia-seltos.webp
2023-07-21 08:40:46.0
Kia Seltos Facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా శుక్రవారం దేశీయ మార్కెట్లో అప్‌డేటెడ్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెల్టోస్ (Seltos) ఆవిష్కరించింది.
Kia Seltos Facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా శుక్రవారం దేశీయ మార్కెట్లో అప్‌డేటెడ్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెల్టోస్ (Seltos) ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ పవర్ ట్రైన్‌లతో 18 ట్రిమ్స్‌లో వస్తున్న ఈ కారు ధరలు రూ.10.89-19.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని తెలిపింది.
`ఆటోమొబైల్ రంగంలో సరసమైన ధరలకు సృజనాత్మక ఆఫర్లతో నిర్దిష్టమైన బెంచ్‌మార్క్ ఏర్పాటు చేయాలన్న నిబద్ధతతో మేం పని చేస్తున్నాం. ఈ ట్రెండ్‌ను కియా మోటార్ న్యూ సెల్టోస్ కొనసాగిస్తుందనడంలో సందేహం లేదు` అని కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓ తాయ్ జిన్ పార్క్ ఓ ప్రకటనలో తెలిపారు.
అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) -2 వ్యవస్థతోపాటు అత్యున్నత శ్రేణి సేఫ్టీ ఫీచర్లు, ఇన్నోవేటివ్ టెక్నాలజీతో నూతన తరం కస్టమర్లకు దగ్గరయ్యే స్ఫూర్తిదాయక వెహికల్‌గా కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ నిలుస్తుందని పేర్కొన్నారు తాయ్ జిన్ పార్క్. విస్తృత శ్రేణి వేరియంట్లతో కూడిన చాయిస్,
ఈ నెల 14న మొదలైన కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ప్రీ-బుకింగ్స్ మొదటి రోజు మరో రికార్డు నెలకొల్పింది. 13,424 యూనిట్లు బుక్ చేసుకున్నారు. వచ్చే నెలలో కస్టమర్లకు డెలివరీ ప్రారంభం అవుతుందని తెలుస్తున్నది. హ్యుండాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా తదితర ఎస్‌యూవీ కార్లతో మార్కెట్లో గట్టిగా పోటీ పడుతుంది.
Kia Seltos Facelift,KIA,Kia Seltos,Telugu News,SUV,Kia India
Kia Seltos Facelift, Kia Seltos, Kia Seltos price, Kia Seltos news, 2023 Kia Seltos, cars, new car, suv, telugu, telugu news, telugu global news, latest telugu news, SUV, Kia India, కియా సెల్టోస్, దక్షిణ కొరియా, ఎస్‌యూవీ, సెల్టోస్
https://www.teluguglobal.com//business/kia-launches-new-seltos-with-price-starting-at-rs-1089-lakh-949382