Krishnamma | వారానికే ఓటీటీలోకి!

 

2024-05-20 17:11:13.0

https://www.teluguglobal.com/h-upload/2024/05/16/1328250-krishnamma-02.webp

Krishnamma movie – సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా కృష్ణమ్మ. విడుదలైన వారానికే ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది.

సాధారణంగా ఫ్లాప్ అయిన సినిమాలు తొందరగా ఓటీటీలోకి వస్తాయి. విడుదలైన వారం రోజులకే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి కృష్ణమ్మ కూడా చేరిపోయింది. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలై సరిగ్గా వారమైంది. అంతలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ప్రత్యక్షమైంది.

దీన్నిబట్టి థియేటర్లలో ఈ సినిమా పరిస్థితేంటనేది అర్థం చేసుకోవచ్చు. మంచి కాన్సెప్ట్ ఎంచుకున్న మేకర్స్, దాన్ని ఎమోషనల్ గా తీయలేకపోయారు. బెజవాడ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కృష్ణమ్మ సినిమాలో హీరో పాత్ర తేలిపోయింది. ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేకపోయింది. అనవసరంగా హీరోయిన్ ట్రాక్ పెట్టారు.

ఇక క్లయిమాక్స్ పెద్దగా పండలేదు. ఈ ప్రతికూల అంశాల కారణంగా కృష్ణమ్మ సినిమా థియేటర్లలో సరిగ్గా ఆడలేదు. అయినప్పటికీ మేకర్స్ మాత్రం తమ సినిమా హిట్టయిందని చెప్పుకున్నాడు. వారం రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ అయిందని ప్రకటించుకున్నారు.

రిలీజైన మొదటి రోజు కృష్ణమ్మకు కోటి రూపాయల గ్రాస్ వచ్చినట్టు ప్రకటించారు నిర్మాతలు. ఆ తర్వాత 6 రోజులకే సినిమా బ్రేక్ ఈవెన్ అయిందన్నారు. విడుదలైన వారం లోపే బ్రేక్ ఈవెన్ అయి, సత్యదేవ్ కెరీర్ లో రికార్డ్ సృష్టించిందన్నారు. అలా ప్రకటించిన 2 రోజులకే సినిమా అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్షమైంది.

 

Krishnamma movie,Satyadev,streaming,Amazon Prime Video