2024-05-11 08:16:21.0
https://www.teluguglobal.com/h-upload/2024/05/11/1326712-love-mouli-navadeep.webp
Love Mouli Movie – నవదీప్ కమ్ బ్యాక్ మూవీ లవ్ మౌళి. ఈ సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.
నవదీప్ సరికొత్త గెటప్ లోకి మారి చేసిన సినిమా లవ్ మౌళి. ఇప్పటికే ఈ సినిమా ప్రచారం మొదలైంది. నవదీప్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. అయితే ఆఖరి నిమిషంలో సినిమాను వాయిదా వేశారు.
ఈ విభిన్నమైన, వైవిధ్యమైన చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి నవదీప్ ని్రమించాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సింగిల్ కట్ లేకుండా సెన్సారు పూర్తయింది. చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ అందజేశారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. “నా లైఫ్ లో జరిగిన ప్రేమకథలకు ఫలితమే ఈ సినిమా కథ. నేను పాన్ ఇండియా లెవల్లో ప్రేమించేవాడ్ని. ప్రేమ అనే టాపిక్‌లో సో మెనీ వెరియేషన్స్ ఉన్నాయి. నా స్వీయ అనుభవాలే ఈ సినిమా కథ, జూన్ 7న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. విభిన్న ప్రేమకథలు కోరుకునే ప్రేక్షకులందరికి మా లవ్ మౌళి మనసులకు హత్తుకుంటుంది” అన్నాడు.
నవదీప్ హిట్ కొట్టి చాన్నాళ్లయింది. ఒక దశలో అతడు సినిమాలు కూడా ఆపేశాడు. మళ్లీ ఇన్నేళ్లకు హీరోగా మారి లవ్ మౌళి సినిమా చేస్తున్నాడు.
Navadeep,Love Mouli Movie,Censor,A Certificate