Mahesh Babu | మహేష్ కొత్త లుక్ ఇదేనా?

 

2024-07-14 05:39:14.0

https://www.teluguglobal.com/h-upload/2024/07/14/1344104-mahesh-babu-1.webp

Mahesh Babu new look – మహేష్ బాబు తన కొత్త మేకోవర్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. అంబానీ పెళ్లిలో అతడే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు హాజరయ్యాడు మహేష్ బాబు. కూతురు సితార, భార్య నమ్రతాతో కలిసి పెళ్లికొచ్చిన మహేష్ బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతడి ఫొటోలు సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలో వైరల్ అయ్యాయి. దీనంతటికీ కారణం అతడి తాజా లుక్.

తన కొత్త మేకోవర్ లో లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు మహేష్. అప్పుడెప్పుడో వచ్చిన అతిథి సినిమా తర్వాత మహేష్ ఇంత జుట్టు పెంచడం ఇదే తొలిసారి. అంతేకాదు, మీసాలు కూడా కాస్త ఎక్కువగానే పెంచాడు. ఇదంతా దేనికోసమో తెలుసా? రాజమౌళి కొత్త సినిమా కోసం. అందుకే ఈ లుక్, దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

త్వరలోనే రాజమౌళితో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు మహేష్. ఈ సినిమాలో మహేష్ ను డిఫరెంట్ గా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు జక్కన్న. దాని కోసమే మహేష్ ఇలా జుట్టు, మీసం పెంచుతున్నాడు. రాజమౌళి సినిమాలో దాదాపు ఇదే లుక్ ఉండొచ్చు.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో విజయేంద్ర ప్రసాద్ రాసిన కథకు మహేష్ ఓకే చెప్పాడు. జర్మనీ లాంటి దేశాల్లోని దట్టమైన అడవుల్లో ఈ సినిమా షూటింగ్ చేయబోతున్నారు. త్వరలోనే మూవీ విశేషాలతో రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు.

 

Mahesh Babu,Mahesh Babu New Look,Rajamouli Mahesh Babu Film,ambani wedding