https://www.teluguglobal.com/h-upload/2023/11/06/500x300_851793-mahindra-suv.webp
2023-11-06 07:13:14.0
Mahindra Diwali Offers | దీపావళి సందర్భంగా ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా పలు మోడల్ కార్లపై ఆఫర్లు అందిస్తోంది.
Mahindra Diwali Offers | మరో వారంలో దీపావళి పండుగ.. భారతీయులు పండుగల సందర్భంగా ప్రత్యేకించి దీపావళికి ఇంట్లోకి, వ్యక్తిగతంగా అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు అందరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీపావళి సందర్భంగా ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా పలు మోడల్ కార్లపై ఆఫర్లు అందిస్తోంది. నవంబర్ నెలలో కొన్ని మోడల్ కార్లపై గరిష్టంగా రూ.3.50 లక్షల వరకు డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ300, బొలెరో, బొలెరో నియో, మరాజో వంటి ప్రముఖ మోడల్ కార్లపై రాయితీలు అందిస్తున్నది. కొన్ని ఫ్లాగ్‌షిప్ మోడల్ కార్లు ఎక్స్‌యూవీ700, స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్, థార్ కార్లను డిస్కౌంట్ల నుంచి మినహాయించింది. మరీ ఆయా కార్లపై మహీంద్రా అండ్ మహీంద్రా ఇస్తున్న డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు తెలుసుకుందామా..!
మహీంద్రా ఎక్స్‌యూవీ300పై ఇలా
మహీంద్రా అండ్ మహీంద్రాలో బుల్లి ఎస్‌యూవీ కారు మహీంద్రా ఎక్స్‌యూవీ300. ఈ కారుపై దీపావళి సందర్భంగా రూ.1.2 లక్షల వరకు బెనిఫిట్ కల్పిస్తున్నది. ఎక్స్‌యూవీ300 లో డబ్ల్యూ8, డబ్ల్యూ6 వేరియంట్లు కూడా జత చేశారు. టాప్ హై ఎండ్ వేరియంట్ డబ్ల్యూ 8 వేరియంట్‌పై రూ.95 వేల క్యాష్ డిస్కౌంట్‌తోపాటు గరిష్ట రాయితీ లభిస్తుంది. డబ్ల్యూ6 వేరియంట్ మీద రూ.80 వేల వరకూ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అందులో ఫ్రీ అఫిషియల్ విడి భాగాల విలువ రూ.25 వేలు ఉంటది.

మహీంద్రా ఎక్స్‌యూవీ400
మహీంద్రా అండ్ మహీంద్రా తన మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ కారుపై నవంబర్‌లో డిస్కౌంట్ అందిస్తున్నది. టాటా నెక్సాన్.ఈవీ తరహాలో మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ కారు కొనుగోలు చేసిన వారికి రూ.1.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకూ డిస్కౌంట్ ప్రకటించింది. టాప్ ఎండ్ ఈ: వేరియంట్ ఎక్స్‌యూవీ400 కారుపై గరిష్ట బెనిఫిట్ పొందొచ్చు. మిడ్ ట్రిమ్ వేరియంట్ రూ.3 లక్షలు, ఎంట్రీ లెవల్ వేరియంట్ ఈసీ కనిష్ట బెనిఫిట్ అందుకుంటుంది.

బొలెరోపై గరిష్టంగా రూ.70 వేల డిస్కౌంట్
మహీంద్రా అండ్ మహీంద్రా తన మహీంద్రా బొలెరో మోడల్ ఎస్‌యూవీ కార్లపై గరిష్టంగా రూ.70 వేల డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. బొలెరో, బొలెరో నియో ఎస్‌యూవీలకు ఇది వర్తిస్తుంది. ఓల్డ్ క్లాసిక్ బొలెరో బీ6 ఆప్షనల్ వేరియంట్ గరిష్టంగా, స్టాండర్డ్ బీ6 వేరియంట్ రూ.35 వేల వరకూ డిస్కౌంట్ పొందుతుంది. ఎంట్రీ లెవల్ బొలెరో బీ4 వేరియంట్ రూ.50 వేల వరకు రాయితీ లభిస్తుంది. వీటితోపాటు రూ.20 వేల విలువైన విడి భాగాలు లభిస్తాయి.
బొలెరో నియో ఎస్‌యూవీ మోడల్ కార్లు మూడు వేరియంట్లలో లభిస్తాయి. వీటిపై గరిష్టంగా రూ.50 వేల వరకూ డిస్కౌంట్ పొందొచ్చు. టాప్ ఎండ్ ఎన్10 వేరియంట్ గరిష్టంగా రూ.50 వేలు, ఎన్4 వేరియంట్ రూ.25 వేలు, ఎన్8 వేరియంట్ రూ.31 వేల డిస్కౌంట్ అందుతుంది.
మహీంద్రా మరాజోపై ఇలా
మహీంద్రా అండ్ మహీంద్రాలో మల్టీపర్పస్ వెహికల్ మహీంద్రా మరాజోపై రూ.58,300 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. అన్ని వేరియంట్లకూ ఇదే డిస్కౌంట్ వర్తిస్తుంది.

Mahindra XUV300,Mahindra and Mahindra,SUV,Mahindra Diwali Offers,Diwali,Mahindra XUV400
Mahindra Diwali Offers, Mahindra XUV300, Mahindra, Mahindra SUV, Mahindra discounts, Mahindra SUV discounts, cars, news, telugu news, telugu global news, upcoming, new cars, Diwali, Diwali offers, దీపావళి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్‌యూవీ కార్లపై దీపావళి డిస్కౌంట్, ఎస్‌యూవీ కార్ల, డిస్కౌంట్, ఆఫర్లు
https://www.teluguglobal.com//business/mahindra-announces-big-discounts-on-its-flagship-suvs-check-details-972353