Mahindra Thar Roxx | మ‌హీంద్రా ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ 5-డోర్ థార్ రాక్స్ ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ డిటైల్స్‌..!

2024-08-15 08:00:41.0

Mahindra Thar Roxx | దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) ఎంతోకాలంగా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ 5-డోర్ థార్ థార్ రాక్స్ (Mahindra Thar Roxx) ను మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Mahindra Thar Roxx | దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) ఎంతోకాలంగా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ 5-డోర్ థార్ థార్ రాక్స్ (Mahindra Thar Roxx) ను మార్కెట్లో ఆవిష్క‌రించింది. ఈ కారు ఎంట్రీ లెవ‌ల్ వేరియంట్ ఎంఎక్స్1 (MX1) ధ‌ర రూ.12.99 ల‌క్ష‌ల నుంచి ప్రారంభం అవుతుంది. డీజిల్ ఎంట్రీ లెవ‌ల్ ఎంఎక్స్1 (MX1) ధ‌ర రూ.13.99 ల‌క్ష‌ల నుంచి ప్రారంభం అవుతుంది. పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ గ‌రిష్టంగా 162 పీఎస్ విద్యుత్‌, 330 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. డీజిల్ వేరియంట్ ఇంజిన్ గ‌రిష్టంగా 152 పీఎస్ విద్యుత్‌, 330 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది.

 

మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx) ఎంట్రీ లెవ‌ల్ ఎంఎక్స్‌1 (MX1) వేరియంట్ స‌మృద్ధి ఫీచ‌ర్ల‌తో ఉంటుంది. ఎల్ఈడీ ప్రొజెక్ట‌ర్ హెడ్ ల్యాంప్స్ మాదిరిగా బెల్స్ విస్టెల్స్‌, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌, డ్యుయ‌ల్ టోన్ మెట‌ల్ టాప్‌, 18 అంగుళాల స్టీల్ వీల్స్‌, 10.25 అంగుళాల ట‌చ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్మెంట్ సిస్ట‌మ్, పుష్ స్టార్ట్ బ‌ట‌న్‌, 60:40 స్ప్లిట్ రేర్ సీట్‌, రేర్ ఏసీ వెంట్స్‌, యూఎస్‌సీ సీ-పోర్ట్ ఉంటాయి.

 

మ‌హీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx) ఎంఎక్స్‌1 (MX1) కారు ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ స్టీరింగ్‌, హైట్ అడ్జ‌స్ట‌బుల్ డ్రైవ‌ర్ సీట్‌, 3-పాయింట్ సీట్‌బెల్ట్ ఫ‌ర్ ఆల్ ప్యాసింజ‌ర్స్‌, సిక్స్ స్టాండ‌ర్డ్ ఎయిర్ బ్యాగ్స్‌, ఎల‌క్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌, బ్రేక్ లాకింగ్ డిఫ‌రెన్షియ‌ల్ వంటి ఫీచ‌ర్లు ఉంటాయి. 35కి పైగా స్టాండ‌ర్డ్ సేఫ్టీ ఫీచ‌ర్లు ఉంటాయి. మ‌హీంద్రా థార్ రాక్స్ హ‌య్య‌ర్ వేరియంట్ కార్ల‌లో సాఫ్ట్ ట‌చ్ లెద‌ర‌ట్టే డాష్ బోర్డ్‌, డోర్ ట్రిమ్స్‌, 10.25 అంగుళాల డిజిట‌ల్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌, వెంటిలేటెడ్ సీట్స్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌, వైర్ లెస్ చార్జ‌ర్‌, హార్మ‌న్ కార్డ‌న్ సౌండ్ సిస్ట‌మ్, ఎల‌క్ట్రిక్ పార్కింగ్ బ్రేక్‌, 360 డిగ్రీ కెమెరా, ప‌నోర‌మిక్ స‌న్‌రూఫ్ వంటి ఫీచ‌ర్లు ఉంటాయి. మ‌హీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx)తోపాటు పాపుల‌ర్ ఎస్‌యూవీ కార్లు మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, 3-డోర్ మ‌హీంద్రా థార్‌, మ‌హీంద్రా స్కార్పియో-ఎన్‌, మ‌హీంద్రా స్కార్పియో క్లాసిక్‌.

మ‌హీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx) కారు మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny), ఫోర్స్ గుర్ఖా (Force Gurkha)ల‌తోపాటు మిడ్ సైజ్ ఎస్‌యూవీ కార్లు హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos), మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) కార్ల‌తో పోటీ ప‌డుతుంది.

 

Mahindra Thar Roxx,Mahindra,Mahindra Thar,Mahindra SUV Cars