2024-08-02 17:34:39.0
https://www.teluguglobal.com/h-upload/2024/08/02/1349293-malavika-mohanan-3.webp
Malavika Mohanan – హీరోయిన్ మాళవిక మోహనన్ మరో మంచి ఆఫర్ అందుకుంది. సర్దార్-2లో ఆమె నటించబోతోంది.
హీరో కార్తి ‘సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇటివలే సర్దార్ 2 రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్‌లో ప్రారంభమైంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనుంది.
తాజాగా మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించనుంది.
ఈ చిత్రంలో ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లో తెరకెక్కతోంది.
ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సర్దార్ 2 చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్. రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్.
Malavika Mohanan,Karthi,sardar 2