2024-07-28 17:12:49.0
https://www.teluguglobal.com/h-upload/2024/07/28/1347930-rao-ramesh.webp
Maruthinagar Subramanyam – రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మారుతీనగర్ సుబ్రమణ్యం. ఈరోజు సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. దర్శకుడు సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రమిది. రావు రమేష్ సరసన ఇంద్రజ హీరోయిన్ గా నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు.
కంటెంట్ నచ్చడంతో తెలంగాణ, ఏపీలో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తోంది. ఆగస్టు 23న సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.
మారుతీనగర్ లో ఉండే సుబ్రమణ్యం, అతని కుమారుడు ఏం చేశారు? ఈ కుటుంబ కథ ఏమిటి? అనేది ఆగస్టు 23న థియేటర్లలో సినిమా చూసి తెలుసుకోవాలి. కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఆ కంటెంట్ ఒక ఎత్తు అయితే… రావు రమేష్ నటన మరొక ఎత్తు. టిపికల్ డైలాగ్ డెలివరీతో సుబ్రమణ్యం పాత్రలో జీవించారు.
Rao Ramesh,Maruthinagar Subramanyam,Indraja