https://www.teluguglobal.com/h-upload/2023/06/25/500x300_788260-maruti-suzuki.webp
2023-06-25 10:34:54.0
Maruti Suzuki | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki). డిజైన్లలోనూ, మైలేజీలోనూ, కంఫర్ట్‌లోనూ ఇప్పటికీ మారుతి సుజుకి కార్లదే పై చేయి.
Maruti Suzuki | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki). డిజైన్లలోనూ, మైలేజీలోనూ, కంఫర్ట్‌లోనూ ఇప్పటికీ మారుతి సుజుకి కార్లదే పై చేయి. ఎవరైనా కారు కొనాలని భావిస్తే ముందు మారుతి మోడల్స్‌పైనే నజర్ పెడతారు. దేశీయ మార్కెట్లో కూడా మారుతి సుజుకి కార్లు కొన్నేండ్లుగా డీసెంట్‌గా అమ్ముడు అవుతున్నాయి. వాటిలో బాలెనో, బ్రెజా తదితర మోడల్ కార్లు `హాట్ కేక్`ల్లా సేల్ అవుతున్నాయంటే అతి శయోక్తి కాదు.
మారుతి సుజుకి కార్ల సేల్స్ పెరుగుతున్నా, ముందస్తుగా ప్రీ-బుకింగ్స్ కూడా 3.86 లక్షలకు పైగా యూనిట్లు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. మహీంద్రా ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ థార్‌తో పోటీ పడేందుకు ఇటీవలే మారుతి సుజుకి మార్కెట్‌లోకి తీసుకొచ్చిన జిమ్నీ బుకింగ్స్ కూడా 31 వేల యూనిట్లు నమోదు కావడం గమనార్హం. అంతే కాదు మారుతి జిమ్నీ ప్రీ బుకింగ్ చేసుకున్న వారు దాదాపు 8-9 నెలలు వెయిటింగ్ పీరియడ్‌లో ఉండాల్సిందే. ఇంతకుముందు మోడల్ కార్లతో పోలిస్తే మారుతి జిమ్నీ అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులో ఉంది.
ప్రస్తుతం మారుతి బ్రెజా బుకింగ్స్ 55 వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రాండ్ విటారా 33 వేల కార్ల బుకింగ్స్ పెండింగ్‌లో ఉంటే తాజాగా ఫ్రాంక్స్ 28 వేలకు పై చిలుకు బుక్ చేసుకున్న వారు నాలుగు నెలల పాటు వెయిట్ చేయాల్సిందే. పలు ఫీచర్లతో మార్కెట్లో ఉన్న మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంపీవీ) కార్లు ఎర్టిగా, ఎక్స్6 బుకింగ్స్ కలిపి లక్షకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. సప్లయ్ చైన్ సంక్షోభం, ఉత్పత్తిలో సమస్యల వల్ల కస్టమర్లు బుక్ చేసుకున్నమోడల్ కార్ల కోసం ఎక్కువ కాలం వెయిటింగ్ చేయాల్సి వస్తుందన్నారు.
మార్కెట్‌లోకి జిమ్నీరాక ముందు బాలెనో బేస్డ్ ఫ్రాంక్స్ మోడల్ కోసం ప్రతి రోజూ 300 బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. ఇంతకుముందు మార్కెట్‌లోకి రాకముందు 1000 ఫ్రాంక్స్ బుకింగ్స్ నమోదయ్యాయని శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.
Shashank Srivastava,Maruti Suzuki,cars,Auto News,Maruti Suzuki Booking
Shashank Srivastava, Maruti Suzuki, Maruti, Suzuki Delhi, India, cars, auto news, telugu news, telugu global news, latest telugu news, Maruti Suzuki Booking status, మారుతి కారు, మారుతి, మారుతి సుజుకి
https://www.teluguglobal.com//business/maruti-suzuki-has-386-lakh-pending-orders-average-waiting-period-goes-upto-3-4-months-943116