Mathu Vadalara 2 | హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ

 

2024-08-27 07:15:05.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/27/1355046-mathu-vadalara-2.webp

Mathu Vadalara 2 – సూపర్ హిట్టయిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ రెడీ అయింది. ఈసారి వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా కూడా యాడ్ అయ్యారు.

2019లో వచ్చిన మత్తు వదలారా సినిమా పెద్ద హిట్టయింది. ఇప్పుడీ హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ అయింది. దీని పేరు మత్తు వదలారా 2. శ్రీ సింహ కోడూరి హీరోగా తన పాత్రను తిరిగి పోషించగా, సత్య స్నేహితుడిగా తిరిగి వస్తాడు. ఒరిజినల్‌కి దర్శకత్వం వహించిన రితేష్ రానా సీక్వెల్ కు కూడా దర్శకుడు.

ఫరియా అబ్దుల్లా ఈ సీక్వెల్‌లో చేరింది. ఆమెతో పాటు, ఈ సీక్వెల్‌లో సునీల్, వెన్నెల కిషోర్, అజయ్ సహా కొత్త నటీనటులు యాడ్ అయ్యారు. దీంతో మత్తు వదలరా 2 ప్రాజక్టు ఇంకాస్త పెద్దదైంది.

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చెర్రీ, హేమలత పెదమల్లు ఈ సినిమాను నిర్మించారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా ఈ సీక్వెల్ ను ప్రకటించారు.

కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. “మత్తు వదలారా 2” సెప్టెంబర్ 13న విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. తొలి భాగంలో పావలా శ్యామల పాత్ర పెద్ద హిట్టయింది. సీక్వెల్ లో ఆమె ఉందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. 

 

Mathu Vadalara 2,Sri Simha,Faria Abdullaah,Sunil