May Best Selling Cars | బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా బాలెనో.. టాప్‌-10లో మారుతిదే ప్రధాన వాటా

https://www.teluguglobal.com/h-upload/2023/06/09/500x300_778903-baleno.webp
2023-06-09 07:38:01.0

May Best Selling Cars | మే నెల కార్ల విక్ర‌యాల్లో ఆల్‌టైం రికార్డు న‌మోదైంది.

May Best Selling Cars | మే నెల కార్ల విక్ర‌యాల్లో ఆల్‌టైం రికార్డు న‌మోదైంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా తొలిసారి 3,34,800 కార్లు అమ్ముడ‌య్యాయి. వాటిల్లో మారుతి సుజుకి మోడ‌ల్ కార్ల‌దే ప్ర‌ధాన వాటా.. బెస్ట్ టాప్‌-10 ఎస్‌యూవీ కార్ల సేల్స్‌లోనూ ఏడు మోడ‌ల్స్ మారుతివే. టాటా మోటార్స్ రెండు మోడ‌ల్స్‌, హ్యుండాయ్ మోటార్ ఇండియా ఒక మోడ‌ల్ కారు టాప్‌లో నిలిచాయి.

మారుతిలో బాలెనో, స్విఫ్ట్‌, వ్యాగ‌న్‌-ఆర్‌, బ్రెజా, ఎకో, డిజైర్‌, ఎర్టిగా మోడ‌ల్ కార్లు టాప్‌-10లో కొన‌సాగుతున్నాయి. హ్యుండాయ్ క్రెటా.. ఫ్లాగ్ బేర‌ర్‌గా కొన‌సాగుతుండ‌గా, టాటా మోటార్స్ వారి టాటా నెక్సాన్‌, టాటా పంచ్ మోడ‌ల్స్ కూడా పాపుల‌ర్ కార్లుగా ఉన్నాయి.

అత్య‌ధికంగా మారుతి బాలెనో 18,700 కార్లు విక్ర‌యించ‌గా, త‌ర్వాతీ స్థానంలో 17,300ల‌తో స్విఫ్ట్ నిలిచింది. వ్యాగ‌న్‌-ఆర్ 16,300 కార్లు అమ్ముడ‌య్యాయి.

హ్యుండాయ్ క్రెటా 14,449 యూనిట్లు విక్ర‌యించ‌గా, టాటా నెక్సాన్ 14,423కార్లు అమ్ముడయ్యాయి. అటుపై మారుతి సుజుకి బ్రెజా 13,398, మారుతి సుజుకి ఎకో 12,800, మారుతి సుజుకి డిజైర్ 11,300 యూనిట్లు యూనిట్లు సేల్ అయ్యాయి. టాటా పంచ్ 11,100 కార్లు అమ్మ‌గా, మారుతి సుజుకి ఎర్టిగా 10,500 కార్లు విక్ర‌యించింది.

మే నెల‌లో అమ్ముడైన బెస్ట్ టాప్‌-10 కార్లు ఇవే

మారుతి సుజుకి బాలెనో – 18,700

మారుతి సుజుకి స్విఫ్ట్‌ – 17,300

మారుతి సుజుకి వ్యాగ‌న్‌- ఆర్‌ – 16,300

హ్యుండాయ్ క్రెటా – 14,449

టాటా నెక్సాన్‌ – 14,423

మారుతి సుజుకి బ్రెజా – 13,398

మారుతి సుజుకి ఎకో – 12,800

మారుతి సుజుకి డిజైర్‌ – 11,300

టాటా పంచ్‌ – 11,100

మారుతి సుజుకి ఎర్టిగా – 10,500

Best Selling Cars,Baleno,Swift,WagonR,SUV,Maruti Suzuki
Largest-selling cars in May, Best-selling cars in May, Baleno, Swift, WagonR, Creta, Nexon, Brezza, Maruti Suzuki

https://www.teluguglobal.com//business/7-maruti-models-among-10-best-selling-cars-in-may-baleno-swift-wagon-r-rule-creta-nexon-brezza-among-top-suvs-938885