Mayaone | సందీప్ కిషన్ టీజర్ ఎలా ఉందంటే!

 

2024-05-09 17:20:32.0

https://www.teluguglobal.com/h-upload/2024/05/08/1325722-maya1-sundeep-kishan-1.webp

Sundeep Kishan’s Mayaone – సందీప్ కిషన్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా మాయావన్. ఈ సినిమా టీజర్ రిలీజైంది.

హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ సివి కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ మూవీ ప్రాజెక్ట్‌జెడ్/మాయవన్‌. ఇప్పుడీ సినిమాకు సెకండ్ పార్ట్ రెడీ అవుతోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ‘మాయవన్‌’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్‌ను విడుదల చేశారు.

టీజర్ మాయవన్ ప్రపంచాన్ని, అందులోని ప్రధాన పాత్రలను కూడా పరిచయం చేస్తుంది. మంచులో ఉన్న సైన్స్ ల్యాబ్‌ను చూపడంతో టీజర్ ఓపెన్ అయ్యింది. అక్కడ మెదడును ఒక వ్యక్తి నుండి మరొకరికి బదిలీ చేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి.

నీల్ నితిన్ ముఖేష్ పోషించిన సూపర్‌విలన్‌కు సూపర్ పవర్స్ ఉన్నాయి, అయితే సందీప్ కిషన్ పోషించిన సామాన్యుడు కూడా చివరికి కొన్ని పవర్స్ తో వస్తాడు. ఆకాంక్ష రంజన్ కపూర్‌తో సందీప్ కిషన్ లవ్ ట్రాక్‌ను కూడా చూపించారు. టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

సందీప్ కిషన్ మంచి స్టంట్స్ చేస్తూ మ్యాన్లీగా కనిపించాడు. మాయావన్ సూపర్‌విలన్‌తో ఒక సామాన్యుడి పోరాటాన్ని చూపే కథ. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

 

Sundeep Kishan,Mayaone Movie,Mayaone Teaser,Anil Sunkara