Mokshagna | మోక్షు సినిమాకు డేట్ ఫిక్స్

 

2024-08-09 12:30:21.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/09/1351120-mokshagna.webp

Mokshagna – మోక్షజ్ఞ తెరపైకి రాబోతున్నాడు. అతడి కొత్త సినిమా ప్రకటనకు ముహూర్తం ఖరారైంది.

నందమూరి నటవారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూకు డేట్ లాక్ అయింది. వచ్చే నెల 6న తేదీన మోక్షజ్ఞ పుట్టినరోజు. ఆ రోజున కొత్త సినిమా వివరాలను అధికారికంగా వెల్లడించబోతున్నారు.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను ఈ నెల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మేరకు బాలకృష్ణ ముహూర్తం కూడా తీసినట్టు తెలుస్తోంది. అయితే ఆ ముహూర్తం కంటే, మోక్షజ్ఞ పుట్టినరోజు నాడు ముహూర్తం మరింత బలంగా ఉందట.

అందుకే నెల రోజులు ఆలస్యంగా ఈ సినిమా ప్రకటన వస్తోంది. ఇదొక సోసియోఫాంటసీ మూవీ. ఇందులో మైథలాజికల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయంట. ఈ సినిమా కోసం ప్రస్తుతం మోక్షజ్ఞ గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు.

ఇటు ప్రశాంత్ వర్మ, తన టీమ్ తో కలిసి స్క్రీన్ ప్లే పనిలో నిమగ్నమయ్యాడు. అన్ స్టాపబుల్ కోసం బాలయ్యతో కొన్ని యాడ్స్ రూపొందించాడు ప్రశాంత్ వర్మ. అప్పుడే అతడి వర్క్ బాలకృష్ణకు నచ్చింది. దానికితోడు హనుమాన్ సినిమా తీసిన విధానం ఇంకా నచ్చింది. దీంతో మోక్షజ్ఞ డెబ్యూను ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారు బాలయ్య.

 

Mokshagna,Debut movie,Sep 6th