Music Shop Murty | మ్యూజిక్ షాప్ మూర్తి ట్రయిలర్ రివ్యూ

 

2024-05-31 17:27:16.0

https://www.teluguglobal.com/h-upload/2024/05/31/1332618-music-shop-1.webp

Music Shop Murty – అజయ్ ఘోష్ లీడ్ రోల్ పోషించిన సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది.

అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు.

కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ సినిమాగా రాబోతోన్న ఈ మూవీ టీజర్, పాటలు, పోస్టర్లు ఇప్పటికే రిలీజయ్యాయి. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను జూన్ 14న విడుదల చేయబోతున్నారు.

మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను చూస్తే నవ్వించేలా, ఏడిపించేలా ఉంది. మిడిల్ క్లాస్ కష్టాలను, కల కనడానికి, ఆ కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదనేలా ఈ చిత్రంలో చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

‘అన్నీ మన కోసమే చేసుకోకూడదు.. కొన్ని మన అనుకునేవాళ్ల కోసం వదులుకోవాలి’ అంటూ అజయ్ ఘోష్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా జూన్ 14న థియేటర్లోకి రాబోతోంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డిజె టిల్లు వంటి బ్లాక్ బస్టర్లను విజయవంతంగా పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి శ్రీనివాస్ బెజుగం కెమెరామెన్‌గా పని చేయగా, పవన్ సంగీతం అందించారు. 

 

Music Shop Murty,Ajay Ghosh,Trailer Review,Chandini Chowdary