Naga Chaitanya, Sobhita Dhulipala: మరో డెస్టినేషన్ వెడ్డింగ్

 

2024-08-21 17:16:32.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/08/1350914-naga-chaitanya-sobhita-dhulipala.webp

Naga Chaitanya, Sobhita Dhulipala: పెళ్లి తేదీ ఆల్రెడీ ఫిక్స్ అయింది. డెస్టినేషన్ లాక్ అయిన తర్వాత డేట్ బయటపెడతారంట.

నాగచైతన్య-శోభిత మేటర్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. వీళ్లకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా వీళ్ల పెళ్లిపై మరిన్ని కథనాలు తెరపైకొస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, వీళ్లిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ వైపు మొగ్గుచూపుతున్నారట. అంటే ఇండియాలో పెళ్లి చేసుకోకుండా, వేరే దేశం వెళ్లి పెళ్లి చేసుకొని ఇండియాకొస్తారన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి కాబోయే భార్యాభర్తలిద్దరూ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటు శోభితకు, అటు నాగచైతన్యకు కామన్ గా నచ్చిన ప్రాంతం లండన్. వీళ్ల తొలి డేటింగ్ కూడా అక్కడే మొదలైనట్టు చెబుతారు చాలామంది. కాబట్టి పెళ్లిని లండన్ లో చేసుకునే అవకాశం ఉందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

గతంలో నాగచైతన్య-సమంత గోవాలో పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే, వాళ్లిద్దరికీ కామన్ గా నచ్చిన ప్రాంతం గోవా కాబట్టి. ఈసారి శోభిత కోసం నాగచైతన్య లండన్ ను సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, వీలైనంత త్వరగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాలని ఈ జంట భావిస్తోందంట. తండేల్ షూటింగ్ పూర్తయిన వెంటనే చైతూ-శోభిత పెళ్లిపై చిన్నపాటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

destination wedding,Naga Chaitanya,Sobhita Dhulipala,Naga Chaitanya Wedding Date,Tollywood