Naga Shaurya | ముహూర్తం, షూటింగ్ అన్నీ ఒకేసారి

 

2024-08-10 16:06:22.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/10/1351414-naga-shaurya.webp

Naga Shaurya New Movie – దాదాపు 12 నెలల సుదీర్ఘ విరామం తర్వాత నాగశౌర్య కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. డీటెయిల్స్ చెక్ చేద్దాం..

హీరో నాగశౌర్య తన నూతన చిత్రాన్ని ప్రకటించాడు. రమేష్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. శౌర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది.

యూనివర్సల్ అప్పీల్‌ ఉన్న కథతో వస్తున్న ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు శౌర్య. ఈ నూతన చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్, వైవిఎస్ చౌదరి, శ్రీను వైట్ల వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన రమేష్ కు… దర్శకుడిగా ఇదే తొలి సినిమా.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రంలో సముద్రఖని విలన్ గా నటిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా, హారిస్ జయరాజ్ మ్యూజిక్ డైరక్టర్ గా వర్క్ చేస్తున్నారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వి, అజయ్, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ కూడా ఇందులో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్ ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తారు.

 

Naga Shaurya,New Movie,Director Ramesh