OG Movie | ఓజీలో మాస్టర్ ఎవరు?

 

2024-05-29 01:21:04.0

https://www.teluguglobal.com/h-upload/2023/06/09/779035-og-movie-pawan-kalyan.webp

OG Movie – పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న క్రేజీ సినిమా ఓజీ. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని ప్రకటించాడు దర్శకుడు సుజీత్.

ఓజీకి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇచ్చాడు దర్శకుడు సుజీత్. పవన్ కల్యాణ్ హీరోగా రాబోతున్న ఈ సినిమాలో ఓజీ అంటే అర్థం ఏంటో వివరించాడు. టైటిల్ లో ఓ అంటే ఓజాస్. జీ అంటే గంభీర్. ఓజాస్ అంటే గురువు పాత్ర పేరు. గంభీర్ అంటే హీరో పాత్ర పేరు.

అలా సినిమాకు ఓజీ అనే టైటిల్ పెట్టినట్టు వెల్లడించాడు. దీంతో ఇప్పుడీ సినిమాపై కొత్త చర్చ మొదలైంది. సినిమాలో ఓజాస్ పాత్ర ఎవరు పోషించారనే ఆసక్తి అందర్లో నెలకొంది. పవన్ కల్యాణ్ కు గురువు పాత్ర అంటే కచ్చితంగా అది ఓ పెద్ద నటుడే చేసి ఉంటాడు. అతడు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంచారు.

మరోవైపు ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టారు. పవన్ సెట్స్ పైకి రావడమే ఆలస్యం, సినిమాను పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికతో ఉన్నారు. ఈ సినిమా కోసం పవన్ 20 రోజులు వర్క్ చేస్తే సరిపోతుంది.

ప్రస్తుతం ఎన్నికల ఫలితాల కోసం పవన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకు అతడు ఓజీ సెట్స్ లో జాయిన్ అవుతాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

బ్రో సినిమా తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇదే. కుదిరితే ఈ ఏడాదిలోనే ఈ మూవీ థియేటర్లలోకి వస్తుంది.

 

OG movie,Pawan Kalyan,Sujeeth