OG Movie | పవన్ తొలి ప్రాధాన్యం దీనికే..!

 

2024-07-31 07:25:52.0

https://www.teluguglobal.com/h-upload/2024/06/04/1333704-og-movie-pawan.webp

OG Movie – సుజీత్ దర్శకత్వంలో వస్తోంది ఓజీ మూవీ. పవన్ తన తొలి ప్రాధాన్యం ఈ సినిమాకే ఇస్తారంట.

ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు పవన్. ఆయనిప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఉప-ముఖ్యమంత్రి. పైగా కొన్ని మంత్రి పదవులు కూడా ఉన్నాయి. ఆ పనులతో ఆయన నిరంతరం బిజీగా ఉన్నారు. మరి ఆయన సినిమాల సంగతేంటి?

ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలు 3. వీటిలో సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ సినిమా కూడా ఒకటి. పవన్ చేస్తున్న సినిమాలన్నింటిలో ఎక్కువ భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న మూవీ ఇదే. పవన్ మరో 20 రోజులు టైమ్ కేటాయిస్తే చాలు, ఓజీ షూటింగ్ పూర్తయిపోతుంది.

అందుకే తన తొలి ప్రాధాన్యం ఈ సినిమాకే ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు పవన్ కల్యాణ్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ మూడో వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రావాలని పవన్ భావిస్తున్నారట. ఇది పూర్తయిన తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలకు కాల్షీట్లు ఇవ్వాలని పవన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది ఓజీ సినిమా. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. 

 

Pawan Kalyan,OG movie,First Priority,DVV,Sujeeth