OnePlus 11R 5G | 100వాట్ల సూప‌ర్ వూక్ చార్జ‌ర్‌తోపాటు సోలార్ రెడ్ వేరియంట్‌తో వ‌న్‌ప్ల‌స్ 11ఆర్ 5జీ ఫోన్‌..!

2024-04-20 09:05:36.0

OnePlus 11R 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ (OnePlus) త‌న వ‌న్ ప్ల‌స్ 11ఆర్ 5జీ (OnePlus 11R 5G) ఫోన్‌ను గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

OnePlus 11R 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ (OnePlus) త‌న వ‌న్ ప్ల‌స్ 11ఆర్ 5జీ (OnePlus 11R 5G) ఫోన్‌ను గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 8+ జెన్ 1 ఎస్వోసీ (Snapdragon 8+ Gen 1 SoC), క‌ర్వ్‌డ్ అమోలెడ్ స్క్రీన్ (curved AMOLED screen), 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో ప‌ని చేస్తుందీ వ‌న్‌ప్ల‌స్ 11ఆర్ 5జీ (OnePlus 11R 5G). త‌దుప‌రి వ‌న్ ప్ల‌స్ త‌న వ‌న్‌ప్ల‌స్ 11ఆర్ 5జీ (OnePlus 11R 5G) ఫోన్‌ను కొత్త‌గా సోలార్ రెడ్ రంగులో ఆవిష్క‌రిస్తామ‌నిఅక్టోబ‌ర్‌లో తెలిపింది. అయితే హై ఎండ్ 18జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్‌కే కొత్త సోలార్ రెడ్ (Solar Red) ఫినిష్ ఫోన్ ప‌రిమితం చేసింది. ప్ర‌స్తుతం సోలార్ రెడ్ (Solar Red) క‌ల‌ర్ వేరియంట్‌లో వ‌న్‌ప్ల‌స్ 11ఆర్ 5జీ (OnePlus 11R 5G) ఫోన్ అందుబాటులో ఉంటుంది. అయితే, ఇప్పుడు మార్కెట్లో ఉన్న క‌ల‌ర్ వేరియంట్ల కంటే ఎక్కువ ధ‌ర ప‌లుకుతుంది.

వ‌న్ ప్ల‌స్ 11ఆర్ 5జీ ఫోన్ (OnePlus 11R 5G) సోలార్ రెడ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.35,999ల‌కు ల‌భిస్తుంది. కొత్త‌గా వ‌స్తున్న సోలార్ రెడ్ క‌ల‌ర్ వేరియంట్‌.. ఇప్ప‌టికే మార్కెట్‌లో ఉన్న గాలాటిక్ సిల్వ‌ర్‌, సోనిక్ బ్లాక్ వేరియంట్ల‌తోపాటు అందుబాటులో ఉంటుంది. గాలాటిక్ సిల్వ‌ర్‌, సోనిక్ బ్లాక్ వేరియంట్ ఫోన్లు రూ.32,999ల‌కు ల‌భిస్తాయి. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో సోలార్ రెడ్ ఆప్ష‌న్‌తో హై ఎండ్ 18 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ మోడ‌ల్‌లో వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించినా, కంపెనీ అధికారిక వెబ్ సైట్‌లో మాత్రం లిస్టింగ్ కాలేదు.

వ‌న్‌ప్ల‌స్ 11 ఆర్ 5జీ (OnePlus 11R 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీప్రెష్ రేట్‌, 1000 హెర్ట్జ్ ట‌చ్ శాంప్లింగ్ రేట్‌తోపాటు 6.74 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + (1,240×2,772 పిక్సెల్స్‌) క‌ర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగ‌న్ 8+ జెన్ 1 ఎస్వోసీ ప్రాసెస‌ర్‌తో వ‌స్తుంది.

వ‌న్‌ప్ల‌స్ 11ఆర్ 5జీ (OnePlus 11R 5G) ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తుంది. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ సెన్స‌ర్‌, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ ప్రైమ‌రీ కెమెరా ఉంటుంది. 100వాట్ల సూప‌ర్ వూక్ ఫ్లాష్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ ఉంటుంది. బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ కూడా ఉంట‌ది.