Pavala Shyamala | పావలా శ్యామలకు మరోసారి మెగా సాయం

 

2024-07-27 14:56:51.0

https://www.teluguglobal.com/h-upload/2024/07/27/1347726-pavala-shyamala.webp

Pavala Shyamala – ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పావలా శ్యామలకు మెగా కాంపౌండ్ నుంచి మరోసారి ఆర్థిక సాయం అందింది. ఈసారి సాయితేజ్ వంతు.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నాడు. ఈ సుప్రీమ్ హీరో తాజాగా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు విరాళం అందించడమే కాకుండా.. ఆ సంస్థ ద్వారా దీనస్థితిలో ఉన్న నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయాన్ని అందించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పావలా శ్యామలకు ఆ ఆర్థిక సాయం అందేలా చేశారు. ఈ క్రమంలో ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ కలిసి ఇలా ఆమెకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.

సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని ఇలా ఆర్థిక సాయాన్ని అందించడంతో నటి పావలా శ్యామల ఎమోషనల్ అయ్యారు. తన దీనస్థితి గురించి చెబుతూ కన్నీరు మున్నీరు అయ్యారు. ఇలాంటి పరిస్థితులో సాయి ధరమ్ తేజ్ తనను గుర్తు పెట్టుకుని మరీ సాయం చేయడం గొప్ప విషయమని ఎమోషనల్ అయ్యారు. ఇక సాయి ధరమ్ తేజ్‌తో వీడియో కాల్‌లో నటి పావలా శ్యామల మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.

అన్ని విధాల అండగా ఉంటామని సాయి తేజ్ భరోసానిచ్చాడు. అందరూ సాయం చేస్తారని, తోడుగా ఉంటారని హామీ ఇచ్చాడు. ‘యాక్సిడెంట్ జరిగినప్పుడు.. మీరు బాగుండాలని, ఏమీ కాకూడదని ఆ దేవుడ్ని ప్రార్థించానంటూ నటి పావల శ్యామల చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఆమె ప్రేమకు, మాటలకు సాయి తేజ్ ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలోనే చిరంజీవి చేసిన ఆర్థిక సాయాన్ని కూడా నటి పావల శ్యామల గుర్తు చేసుకున్నారు.

 

Sai Dharam Tej,Pavala Shyamala,Financial Help