Prabhas | ఇకపై ఒకేసారి 3 సినిమాలు

 

2024-07-23 17:20:00.0

https://www.teluguglobal.com/h-upload/2023/12/30/934780-prabhas.webp

Prabhas – ఒకపై ఒకేసారి 3 సినిమాల్ని సమాంతరంగా పూర్తిచేయబోతున్నాడు ప్రభాస్. ఇంతకీ ఆ 3 సినిమాలేంటి?

కల్కి సూపర్ సక్సెస్, ప్రభాస్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తెలుగు రాష్ట్రాల్లోనూ, హిందీ మార్కెట్‌లోనూ, ఓవర్సీస్‌లోనూ భారీ ఓపెనింగ్స్‌ రాబట్టగల ఏకైక తెలుగు స్టార్‌ తానేనని, కల్కి సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు రెబల్ స్టార్.

ఇదిలా ఉంటే, ఈ ఏడాది చివర్లో 2 కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు, అలాగే కొన్నేళ్లుగా ప్రీ-ప్రొడక్షన్ లో ఉన్న మరో చిత్రానికి సంబంధించిన పనిని కొనసాగించబోతున్నాడు ప్రభాస్.

దర్శకుడు ప్రశాంత్ నీల్ “సాలార్ 2” చిత్రాన్ని ఆగస్టులో ప్రారంభించాలని భావిస్తున్నాడు. ప్రభాస్ షూటింగ్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. “కల్కి” విడుదలైన తర్వాత ప్రభాస్ స్టార్ట్ చేయబోయే సినిమా ఇదే. దీంతో పాటు కల్కి-2 కూడా చేయాలి.

ఇక ఈ సంవత్సరం ముగిసేలోపు హను రాఘవపూడి పీరియాడికల్ డ్రామా కూడా స్టార్ట్ చేస్తాడు ప్రభాస్. ప్రస్తుతం రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. చాన్నాళ్లుగా సెట్స్ పై ఉన్న ఆ సినిమా షూటింగ్ ను ప్రభాస్ ముందుగా పూర్తిచేయాల్సి ఉంది.

ఇలా ఒకేసారి 3 సినిమాల్ని కొనసాగించాలనుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్. వీటిలో ఒకటి పూర్తయిన తర్వాత.. సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా మొదలవుతుంది.

 

Prabhas,3 movies,Salaar 2,Kalki 2,Raja saab