Prabhas | పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్

 

2024-08-07 16:37:55.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/07/1350634-prabhas.webp

Prabhas – వయనాడ్ బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించాడు హీరో ప్రభాస్.

హీరో ప్రభాస్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. కేరళలోని వయనాడ్ బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. టాలీవుడ్ నుంచి వయనాడ్ కు అందిన అతిపెద్ద విరాళం ఇదే.

కొండ చరియలు విరిగిపడి వయనాడ్ లో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంత బాధితుల కోసం, వయనాడ్ పునర్నిర్మాణం కోసం టాలీవుడ్ ముందుకొచ్చింది. చిరంజీవి-రామ్ చరణ్ కలిసి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.

అంతకంటే ముందు అల్లు అర్జున్, రష్మిక, నిర్మాత నాగవంశీ లాంటి ఎంతోమంది ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. తమ డబ్బును కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారు. కాస్త లేటుగా స్పందించినప్పటికీ, తన పెద్ద మనసు చాటుకున్నాడు ప్రభాస్. సహాయనిధికి ఏకంగా 2 కోట్ల రూపాయలు అందించాడు.

ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ సినిమా తర్వాత అతడు హను రాఘవపూడి దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. వీటితో పాటు కల్కి-2, సలార్-2 సినిమాలు కూడా అతడు ప్రారంభించాల్సి ఉంది. ఇవి కాకుండా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా ఉంది.

 

Prabhas,2 crore donation,Wayanad