2024-08-23 02:19:10.0
https://www.teluguglobal.com/h-upload/2024/08/23/1354066-prabhas-amir.webp
Amir Khan Prabhas – ప్రభాస్ చేయాల్సిన ఓ సినిమా ఇప్పుడు అమీర్ ఖాన్ చేతికి వెళ్లినట్టు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ తన పరిధిని విస్తరిస్తోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. తమిళ్ లో అజిత్ తో ఇప్పటికే సినిమా చేస్తున్న ఈ నిర్మాణ సంస్థ.. హిందీలో గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ సినిమాను ఓపెన్ చేసింది.
ఇప్పుడు మరో సినిమా కోసం ప్రభాస్ ను ట్రై చేస్తే, అతడి స్థానంలోకి అమీర్ ఖాన్ వచ్చినట్టు తెలుస్తోంది. చాలా కాలం కిందటే లోకేష్ కనగరాజ్‌ని లాక్ చేసింది మైత్రీ. మొదట్లో ప్రభాస్ ఈ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకురావాలనుకున్నారు.
అయితే ఇప్పుడు ఈ ఆలోచన విరమించుకుని ప్రభాస్ స్థానంలో అమీర్ ఖాన్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం ప్రభాస్ అందుబాటులో లేకపోవడమే.
అమీర్ కు లోకేష్ కనగరాజ్ ఓ అదిరిపోయే కథ చెప్పాడట. అమీర్ కూడా ఓకే చెప్పాడని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టు ఎనౌన్స్ చేస్తారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా కూలీ సినిమా చేస్తున్నాడు లోకేష్ కనగరాజ్. ఈ ప్రాజెక్టు తర్వాత ఖైదీ-2 ఉంటుంది. ఆ తర్వాత అమీర్ ఖాన్ సినిమా పట్టాలపైకి వస్తుంది.
Amir Khan,Prabhas,Lokesh Kanagaraj,Mythri Movie Maker