Prabhas Kannappa | కన్నప్ప షూట్ స్టార్ట్ చేసిన ప్రభాస్

 

2024-05-09 17:24:41.0

https://www.teluguglobal.com/h-upload/2023/12/30/934780-prabhas.webp

Prabhas Kannappa – తన సినిమాలన్నీ పక్కనపెట్టాడు ప్రభాస్. కన్నప్ప సినిమాను స్టార్ట్ చేశాడు.

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్‌ వంటి వారు కన్నప్ప సెట్‌లో అడుగు పెట్టి షూటింగ్‌లను పూర్తి చేశారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ అధికారికంగా సెట్‌లోకి అడుగుపెట్టాడు.

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుని భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నారు.

ఈ సినిమా సెట్స్ లోకి ప్రభాస్ వచ్చాడనే విషయాన్ని స్వయంగా మంచు విష్ణు ప్రకటించాడు. ఈ మేరకు ప్రభాస్ కాలుమోపిన ఫొటోను విడుదల చేశాడు.

ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ కన్నప్పకు వర్క్ చేస్తున్నాడు. 6 దేశాల్లో ఈ సినిమా గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. మేజర్ పార్ట్ షూటింగ్ ను న్యూజిలాండ్ లో పూర్తి చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

 

Prabhas,Kannappa,Manchu vishnu