Prabhas Marriage | ప్రభాస్ పెళ్లిపై స్పందించిన పెద్దమ్మ

 

2024-07-08 05:57:40.0

https://www.teluguglobal.com/h-upload/2023/12/30/934780-prabhas.webp

Prabhas Marriage – ప్రభాస్ పెళ్లెప్పుడు? దీనిపై పెద్దమ్మ శ్యామలాదేవి స్పందించారు.

44 ఏళ్ల ప్రభాస్ పెళ్లి మేటర్ దాదాపు పదేళ్లుగా నలుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు తన పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడు ప్రభాస్. అతడి పెళ్లి చూడాలనేది కృష్ణంరాజు చిరకాల కోరిక. ఆ కోరిక తీరకుండానే ఆయన కాలంచేశారు.

ఇప్పుడు ప్రభాస్ పెళ్లి అంశం మరోసారి తెరపైకొచ్చింది. కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలదేవి, ప్రభాస్ పెళ్లిపై స్పందించారు. అతడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాడని అంటున్నారామె.

“ప్రపంచవ్యాప్తంగా కల్కి సంబరాలు జరుపుకుంటున్నాం కదా. త్వరలోనే ప్రభాస్ పెళ్లి సంబరాలు కూడా జరుపుకుంటాం. అయితే అన్ని ఆనందాలు ఒకేసారి ఉండకూడదు. ఒకదాని తర్వాత ఒకటి సెలబ్రేట్ చేసుకుందాం. ముందు కల్కి ఆనందం.. ఆ తర్వాత ప్రభాస్ పెళ్లి. ప్రభాస్ చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచనని అన్నాడు. కాబట్టి ఆ బిజీ కాస్త తగ్గిన తర్వాత పెళ్లి.”

ఇలా ప్రభాస్ పెళ్లిపై ప్రకటన చేశారు శ్యామలాదేవి. అయితే ప్రభాస్ ఎప్పుడు ఫ్రీ అవుతాడు, అతడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడనేది మాత్రం ఆమె చెప్పలేదు. ప్రస్తుతం ఈ హీరో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ లో అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు.

 

Krishnam Raju,shyamala devi,prabhas marriage,Kalki Movie