2024-05-08 01:58:35.0
https://www.teluguglobal.com/h-upload/2024/05/08/1325726-nara-rohit-prathinidhi-2-1.webp
Prathinidhi 2 – నారా రోహిత్ హీరోగా నటిస్తున్న సినిమా ప్రతినిథి-2. ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.
ఎన్నికల వేళ, పొలిటికల్ సబ్జెక్టులతో వచ్చే సినిమాలకు సెన్సార్ పూర్తవ్వడం చాలా కష్టంగా మారింది. ఎన్నో నిబంధనలు, అడ్డంకులు దాటుకొని రావాల్సి ఉంటుంది. ఆమధ్య రామ్ గోపాల్ వర్మ తీసిన ఓ సినిమా ఎన్ని సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొందో అందరం చూశాం. ప్రతినిధి-2 సినిమాకు కూడా అలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని అంతా భావించారు. ఎట్టకేలకు ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది.
‘ప్రతినిధి 2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హీరో నారా రోహిత్. జర్నలిస్ట్ మూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు.
తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మే 10న ‘ప్రతినిధి 2’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రతినిధి 2 మూవీ టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. కొన్ని సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. వీటిలో ఓ మాస్ సాంగ్ కూడా ఉంది. ప్రతినిధి ఫ్రాంచైజీ నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. ఇందులో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నాడు. సిరీ లెల్లా హీరోయిన్ గా నటిస్తుండగా.. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించాడు.
Prathinidhi 2,censor formalities ,Nara Rohit