Priyadarshi | ప్రియదర్శి సినిమాకు టైటిల్ ఫిక్స్

 

2024-08-25 17:25:16.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/25/1354730-sarangapani-jathakam.webp

Priyadarshi – ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి చేస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు.

శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో ఇదివరకే ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ లాంటి హిట్ సినిమాలొచ్చాయి. తాజాగా వాళ్లిద్దరి కలయికలో ప్రియదర్శి హీరోగా మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.

మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రారంభం నుంచి ముగింపు వరకు నవ్వించే ఓ పూర్తిస్థాయి జంధ్యాల తరహా వినోదాత్మక సినిమా ఇది.

మోహనకృష్ణ ఇంద్రగంటికి ఈ బ్యానర్ లో ఇది వరుసగా మూడో చిత్రమిది. ప్రియదర్శి, ‘వెన్నెల’ కిశోర్, వైవా హర్ష, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల వంటి నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. రూప కొడువాయూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇందులో నాలుగు పాటలున్నాయి. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై వస్తున్న 15వ సినిమా ఇది. ఇప్పటివరకు 90 శాతం షూటింగ్ పూర్తయింది.

 

Priyadarshi,Indraganti,New Movie,Saranjapani Jathakam