2024-08-01 17:19:27.0
https://www.teluguglobal.com/h-upload/2024/08/01/1349020-priyadarshi.webp
Priyadarshi – విలక్షణ పాత్రలు పోషిస్తుంటాడు ప్రియదర్శి. ఇప్పుడీ నటుడు లెక్కల మాస్టారుగా మారాడు.
నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ “35-చిన్న కథ కాదు”. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ డైరెక్టర్.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ లెక్కల మాస్టారు చాణక్య వర్మ గా యాక్టర్ ప్రియదర్శిని పరిచయం చేస్తూ ఒక స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.
లెక్కలు మాస్టారు గా ప్రియదర్శి క్యారెక్టర్ ఆసక్తికరంగా ఉంది. లుక్, పెర్ఫార్మన్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. ఈ గ్లింప్స్ ప్రియదర్శి క్యారెక్టర్ పై, సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది.
పెళ్లి చూపులు, సమ్మోహనం, అంటే సుందరానికీ తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.
Priyadarshi,maths teacher,35 Movie,Rana Daggubati