2024-07-19 15:41:27.0
https://www.teluguglobal.com/h-upload/2024/06/17/1337307-pushpa-2.webp
Pushpa 2 – బన్నీ-సుక్కూ కాంబోలో వస్తున్న సీక్వెల్ పుష్ప-2. ఈ సినిమాపై చాలా ఊహాగాానాలు వినిపిస్తున్నాయి. మేకర్స్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అటు సుకుమార్ కూడా దేశవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించాడు. దీంతో పుష్ప-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈమధ్య కాలంలో సినిమాపై అనుమానాలు ఎక్కువయ్యాయి. సినిమా ఆల్రెడీ ఓసారి వాయిదా పడ్డంతో పాటు.. దర్శకుడు సుకుమార్, హీరో బన్నీ మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సినిమా షూటింగ్ మధ్యలో ఆపేసి సుకుమార్ అమెరికా వెళ్లిపోయారట. దీంతో బన్నీ హర్ట్ అయ్యాడంట. సుకుమార్ హైదరాబాద్ వచ్చిన వెంటనే బన్నీ యూరోప్ వెళ్లిపోయాడంట. అంతేకాదు, సినిమా కోసం పెంచిన గడ్డం కూడా ట్రిమ్ చేశాడని అంటున్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేసిన మాట నిజమేనని, త్వరలోనే అతడు సెట్స్ పైకి వస్తాడని తెలిపింది. చంద్రబోస్ తో ఐటెంసాంగ్ డిస్కషన్ కోసమే సుకుమార్ అమెరికా వెళ్లాడని స్పష్టం చేసింది.
పుష్ప-2కు సంబంధించి ఓ ఇంపార్టెంట్ సీక్వెన్స్ తో పాటు.. 2 పాటలు పెండింగ్ లో ఉన్నాయంట. ఆగస్ట్ మొదటి వారం నుంచి ఆ షెడ్యూల్ స్టార్ట్ చేసి, డిసెంబర్ 6కి కచ్చితంగా థియేటర్లలోకి వస్తామని అంటున్నారు మేకర్స్.
Allu Arjun,Pushpa 2,allu arjun sukumar movie updates,Sukumar,Rashmika