Pushpa 2 | సూపర్ హిట్టయిన టైటిల్ సాంగ్

 

2024-05-02 17:28:54.0

https://www.teluguglobal.com/h-upload/2024/05/02/1324268-pushpa-2-1.webp

Pushpa 2 song All-time Record – బన్నీ హీరోగా నటించిన పుష్ప-2 నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇది ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది.

పుష్ప 2 సాంగ్ పెద్ద హిట్టయింది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ని ఆగస్ట్ 15న థియేట్రికల్ రిలీజ్‌కి రెడీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

‘పుష్ప పుష్ప’ సాంగ్ విడుదలైన 6 భాషల్లో మొదటి 24 గంటల్లో దేశంలో అత్యధికంగా చూసిన లిరికల్ పాటగా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజిషన్ 40 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ని సంపాదించుకుంది.

ఐకాన్ స్టార్ వేసిన హుక్ స్టెప్ ను ఈ లిరికల్ వీడియోలో చూపించారు. దీంతో ఈ పాటకు 1.27 మిలియన్ లైక్‌లు వచ్చాయి. ఇది 15 దేశాల్లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు విజయ్ పోలాకి, సృష్టి వర్మ ఈ పాటకు పనిచేశారు.

ఈ పాట‌ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో కూడా విడుద‌ల చేశారు. తాజాగా వ‌దిలిన ఈ పాట‌తో అటు ఐకాన్‌స్టార్ అభిమానులు, ఇటు పుష్ప ప్రేమికులు సంబ‌రాల్లో ఉన్నారు.

 

Pushpa 2,All-time Record,DSP,Allu Arjun