Raayan Movie | ధనుష్ 50వ చిత్రం ట్రయిలర్ ఇదే

 

2024-07-16 16:11:41.0

https://www.teluguglobal.com/h-upload/2024/07/16/1344856-raayan.webp

Dhanush Raayan Trailer – ధనుష్ 50వ సినిమా రాయన్. అతడే దర్శకుడు కూడా. తాజాగా ట్రయిలర్ రిలీజైంది.

ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించి నటించిన చిత్రం రాయన్. కెరీర్ లో అతడికిది ప్రతిష్టాత్మక 50వ చిత్రం. రాయన్ సెన్సార్‌తో సహా అన్ని ఫార్మాలిటీస్‌ పూర్తి చేసుకుంది. ఈ నెల 26న విడుదలకానుంది.

తాజాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. సినిమా కథ ఏంటనేది ఈ ట్రయిలర్ లో బయటపెట్టలేదు. కేవలం నేపథ్యం, హీరో షేడ్స్ మాత్రమే బయటపెట్టారు. అయినప్పటికీ ట్రయిలర్ ఉత్కంఠభరితంగా ఉంది. మూవీలో మంచి యాక్షన్ సన్నివేశాలున్నాయనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

ధనుష్‌పై ఎవరో నీరు పోయడం, అతని శరీరం నుండి రక్తం కారడం లాంటి సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమైంది. తరువాతి ఎపిసోడ్‌లో సెల్వరాఘవన్ యువ రాయన్‌కి అడవిలోని అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన జంతువుల గురించి వివరిస్తాడు. ఆ తర్వాత, ట్రైలర్ సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్ జే సూర్య, ప్రకాష్ రాజ్ పాత్రలను చూపించింది.

ట్రయిలర్ లో ధనుష్ సీరియస్ గా కనిపించాడు. అతడి మేకోవర్ బాగుంది. విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రిలీజ్ చేయబోతున్నారు. 

 

Dhanush,150th Movie,Raayan,Raayan Trailer