2024-07-30 15:59:40.0
https://www.teluguglobal.com/h-upload/2024/07/30/1348408-rajtarun.webp
Raj Tarun – మహేష్ బాబుకు వీరాభిమాని రాజ్ తరుణ్. కానీ తన సినిమాల్లో మహేష్ రిఫరెన్సులు వాడనంటున్నాడు.
ఇష్టమైన హీరోలను అనుకరించడం కామన్. ఉదాహరణకు నితిన్ నే తీసుకుందాం. పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అతడు. అందుకే తన సినిమాల్లో పవన్ ను అనుకరిస్తుంటాడు. కుదిరితే పవన్ సినిమాల్లోని హిట్ పాటల్ని కూడా రీమిక్స్ చేస్తాడు. అడిగితే, పవన్ అభిమానిగా తనకు ఆ హక్కు ఉందంటాడు.
ఈ వాదనతో హీరో రాజ్ తరుణ్ ఏకీభవించడం లేదు. ఈ హీరో మహేష్ బాబుకు వీరాభిమాని. ఎప్పటికైనా మహేష్ ను కలవాలని గట్టిగా ప్రయత్నించాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా కుదరలేదు. చివరికి ఎవరో చొరవ తీసుకొని, బ్రహ్మోత్సవం సెట్స్ లో మహేష్ ను కలిసే ఏర్పాటు చేశారు.
అలా మహేష్ ను కలిసిన రాజ్ తరుణ్, తన సినిమాల్లో మాత్రం మహేష్ ను అనుకరించనని క్లారిటీ ఇచ్చాడు. మహేష్ హిట్ సినిమాల సాంగ్స్ ను కూడా రీమిక్స్ చేయనని స్పష్టం చేశాడు. దీనికి అతడు రీజన్ కూడా చెప్పాడు.
తను దర్శకుల హీరోనని అంటున్నాడు రాజ్ తరుణ్. దర్శకుడు చెప్పింది చేస్తానని, తన ఇష్టాల్ని దర్శకులపై రుద్దనని అంటున్నాడు. నిజంగా తన సినిమాల్లో ఎక్కడైనా మహేష్ బాబు సందర్భం వస్తే తప్పకుండా అతడి సన్నివేశాలు, పాటలు వాడుకుంటామని, అలాంటి సందర్భం పెట్టమని తను మాత్రం దర్శకులకు చెప్పనని అంటున్నాడు.
Raj Tarun,Mahesh Babu,New Movie