Raja Saab | ప్రభాస్ సినిమా షూటింగ్ అప్ డేట్స్

 

2024-08-27 07:17:28.0

https://www.teluguglobal.com/h-upload/2024/07/30/1348403-prabhas-raja-saab.webp

Prabhas Raja Saab – రాజాసాబ్ మరో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇంకో 3 నెలలు షూటింగ్ ఉంది.

సలార్, కల్కి సినిమాల్లో పూర్తిస్థాయిలో యాక్షన్ లుక్ లో కనిపించాడు ప్రభాస్. ఈసారి మాత్రం తన కొత్త సినిమా కోసం స్టయిలిష్ గా మారాడు. అదే రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ మేకోవర్ అయ్యాడు.

టిజి విశ్వపసాద్ నిర్మిస్తున్న ‘ది రాజా సాబ్’లో, ప్రభాస్ పాత్ర వినోదాత్మకంగా ఉంటుంది. అంతేకాదు, ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ కూడా ఉంది. ఒక హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటిస్తుండగా, రెండో హీరోయిన్ గా నిధి అగర్వాల్ కనిపించనుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ పూర్తిచేశాడు ప్రభాస్. ఈ షెడ్యూల్ లో ప్రభాస్, మాళవిక, నిధి అగర్వాల్ కాంబినేషన్ లో సన్నివేశాలు తెరకెక్కించారు. ప్రస్తుతం యూనిట్ చిన్న గ్యాప్ తీసుకుంటోంది.

మరో 3 నెలల పాటు షూటింగ్ కొనసాగనుంది. తదుపరి షెడ్యూల్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. 2025 ఏప్రిల్ 10న విడుదలకానుంది రాజా సాబ్ సినిమా. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 

 

Prabhas,Raja Saab,shooting updates,Maruthi