2024-05-22 01:58:30.0
https://www.teluguglobal.com/h-upload/2024/05/22/1329559-rakshana-payal-1.webp
Payal Rajput’s Rakshana – పాయల్ తాజా చిత్రం రక్షణ. ఈ సినిమా టీజర్ రిలీజైంది.
“వాడెవడో తెలియదు.. కానీ ఎలాంటి వాడో తెలుసు. ఇప్పటి వరకు నేను కచ్చితంగా వాడిని కలవలేదు.. ఏరోజు నేను వాడ్ని కలుస్తానో అదే వాడి అఖరి రోజు’’. ఇలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తోంది పాయల్ రాజ్‌పుత్. ఇంతకీ ఈమె అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందెవరికి.. ఎందుకోసం.. ఎవర్ని ఆమె వెతుకుతుంది అనే వివరాలు తెలియాలంటే మాత్రం ‘రక్షణ’ సినిమా చూడాల్సిందేంటున్నారు మేకర్స్.
ఆర్ ఎక్స్ 100, మంగళవారం వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా..పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రక్షణ’. రోషన్, మానస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే..ఓ హంతకుడు క్రూరంగా హత్యలు చేస్తుంటాడు.. అతనెవరో కనిపెట్టి అరెస్ట్ చేయాలని పోలీస్ ఆఫీసర్ అయిన పాయల్ రాజ్‌పుత్ ప్రయత్నిస్తుంటుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రక్షణ చిత్రం మెప్పించనుంది.
హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామంటున్నాడు దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్.
Payal Rajput,Rakshana Movie,Teaser Launch