Ram Pothineni | సెట్స్ పైకొచ్చిన రామ్

 

2024-06-15 17:16:26.0

https://www.teluguglobal.com/h-upload/2024/05/15/1327962-double-ismart-1.webp

Ram Pothineni – లాంగ్ గ్యాప్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ సెట్స్ లో ప్రత్యక్షమయ్యాడు హీరో రామ్ పోతినేని. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షెడ్యూల్ నడుస్తోంది.

మార్చి నెల నుంచి డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని ఫైనాన్స్ కారణాల వల్ల, మరికొన్ని క్రియేటివ్ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. లేదంటే శివరాత్రికే సినిమా రిలీజ్ అవ్వాలి. అలా ఆగిపోయిన డబుల్ ఇస్మార్ట్ సినిమా రీసెంట్ గా సెట్స్ పైకి వచ్చింది.

ముంబయిలో మరోసారి పూజా కార్యక్రమాలు నిర్వహించి మరీ డబుల్ ఇస్మార్ట్ కొత్త షెడ్యూల్ ప్రారంభించారు. అయితే సినిమా సెట్స్ పైకి వచ్చినా, హీరో రామ్ మాత్రం సెట్స్ పైకి రాలేదు. ఇప్పుడు అది కూడా జరిగింది. డబుల్ ఇస్మార్ట్ మూవీపైకి రామ్ వచ్చాడు. మొన్నటివరకు ముంబయిలో ఈ సినిమా షూటింగ్ జరగ్గా, తాజాగా హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలైంది.

ఈ షెడ్యూల్ లో రామ్ జాయిన్ అయ్యాడు. రామ్, గెటప్ శ్రీను మధ్య కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని భావిస్తున్నాడు రామ్. ఎందుకంటే, అతడు ఆల్రెడీ హరీశ్ శంకర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మరోవైపు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమాను స్టార్ట్ చేశాడు. వీటిలో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నాడు రామ్. అలా జరగాలంటే, డబుల్ ఇస్మార్ట్ వేగంగా పూర్తవ్వాలి.

 

Ram Pothineni,Double Ismart,shooting updates,Puri Jaganadh