Ramcharan | చరణ్-బుచ్చిబాబు సినిమా సిద్ధం

 

2024-06-21 12:17:55.0

https://www.teluguglobal.com/h-upload/2024/03/21/1308592-ramcharan-janhvi-kapoor-1-1.webp

Ramcharan – బుచ్చిబాబుతో చేయాల్సిన రామ్ చరణ్ సినిమా మెల్లమెల్లగా ఊపందుకుంటోంది. ఈ సినిమా కోసం మేకోవర్ అవ్వబోతున్నాడు చరణ్.

ఓవైపు గేమ్ ఛేంజర్ షూటింగ్ నడుస్తుండగానే, మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో చేయాల్సిన సినిమాకు సంబంధించి పనులు మొదలు పెట్టాడు రామ్ చరణ్. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ఆగస్ట్ నుంచి కాల్షీట్లు కేటాయించాడు రామ్ చరణ్.

నిజానికి అంతకంటే ముందే ఈ సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు చరణ్. దీని కోసం ఆస్ట్రేలియా వెళ్లి నెల రోజులకు పైగా ట్రయినింగ్ తీసుకుంటాడు.

ఆ వెంటనే సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈ గ్యాప్ లో జాన్వి కపూర్ కూడా దేవర సినిమా ముగించి, ఫ్రీ అవుతుంది.

వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 3 పాటల రికార్డింగ్ పూర్తయింది. 

 

Ramcharan,Australia,Makeover,BuchiBabu