2024-06-11 17:29:30.0
https://www.teluguglobal.com/h-upload/2024/06/11/1335476-raviteja-75.webp
Raviteja’s 75th Movie – కెరీర్ లో 75వ చిత్రం మైలురాయికి చేరుకున్నాడు రవితేజ. ఈరోజు సినిమా మొదలైంది.
మాస్ మహారాజా రవితేజ తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ చిత్రాన్ని ప్రారంభించాడు. తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. యువ రచయిత భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
మాస్ మహారాజా రవితేజ పేరు వినగానే గుర్తొచ్చేది మాస్, కామెడీ. ఇప్పుడు రవితేజ తన 75వ చిత్రంలో హాస్యంతో కూడిన మాస్ పాత్రలో కనిపించనున్నాడని చిత్రబృందం వెల్లడించింది. వినోదంతో కూడిన పూర్తిస్థాయి మాస్ పాత్రలో రవితేజను చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ కోరిక ఈ చిత్రంతో తీరుతుందంట
బ్లాక్ బస్టర్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’కి మాటల రచయితగా, మరో బ్లాక్ బస్టర్ ‘సామజవరగమన’కు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు భాను బోగవరపు. బాలకృష్ణ-బాబి సినిమాకు కూడా ఇతడే డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇప్పుడు రవితేజ 75వ చిత్రంతో దర్శకుడిగా మారాడు.
ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్. రవితేజ-శ్రీలీల జోడి గతంలో “ధమాకా”తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. “ధమాకా” విజయంలో కీలకపాత్ర పోషించిన సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. ఇవాళ్టి నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు.
Raviteja,75th Movie,Sreeleela