Realme Narzo 70 Pro 5G | రియ‌ల్‌మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియ‌ల్‌మీ నార్జో70 ప్రో 5జీ.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

2024-03-20 07:59:15.0

Realme Narzo 70 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ నార్జో70 ప్రో 5జీ (Realme Narzo 70 Pro 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.

Realme Narzo 70 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ నార్జో70 ప్రో 5జీ (Realme Narzo 70 Pro 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. 6ఎన్ఎం ఓక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. డ్యుయ‌ల్ టోన్ ఫినిష్‌తోపాటు హ‌రిజాన్ గ్లాస్ డిజైన్‌తో అందుబాటులో ఉంటుంది. ఫింగ‌ర్‌ప్రింట్స్‌, వాట‌ర్ డ్రాప్స్‌ను వేర్వేరుగా చూసే రెయిన్‌వాట‌ర్ స్మార్ట్ ట‌చ్ ఫీచ‌ర్ కూడా జ‌త చేశారు.

రియ‌ల్‌మీ నార్జో 70ప్రో 5జీ (Realme Narzo 70 Pro 5G) ఫోన్ గ్లాస్ గ్రీన్‌, గ్లాస్ గోల్డ్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.18,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999ల‌కు సొంతం చేసుకోవ‌చ్చు. అమెజాన్ డాట్ కామ్‌, రియ‌ల్‌మీ ఇండియా వెబ్‌సైట్ ద్వారా గురువారం (మార్చి22) మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి విక్ర‌యాలు ప్రారంభం అవుతాయి. ఈ ఫోన్‌తోపాటు రూ.2,299 విలువ గ‌ల రియ‌ల్‌మీ టీ300 టీడ‌బ్ల్యూఎస్ (Realme T300 TWS) ఇయ‌ర్ ఫోన్లు ఫ్రీగా అందుకోవ‌చ్చు. ఈ ఇయ‌ర్‌బ‌డ్స్ డోమ్ గ్రీన్ క‌ల‌ర్‌లో అందుబాటులో ఉంటాయి. మంగ‌ళ‌వారం సాయంత్రం ఆరు గంట‌ల నుంచే ఎర్లీబ‌డ్ సేల్ ప్రారంభ‌మైంది. ఎర్లీబ‌డ్ సేల్ కింద ఈ ఫోన్ బుక్ చేసుకున్న వారికి రూ.4,299 వ‌ర‌కూ బెనిఫిట్స్ పొందొచ్చు.

రియ‌ల్‌మీ నార్జో 70ప్రో 5జీ (Realme Narzo 70 Pro 5G) ఫోన్ 120 హెర్జ్ట్ రీఫ్రెష్ రేట్‌, 2200 హెర్ట్జ్ ట‌చ్ శాంప్లింగ్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (2,400 x 1,080 పిక్సెల్స్‌) ఓలెడ్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంటుంది. మాలీ-జీ68 జీపీయూ (Mali-G68 GPU)తోపాటు ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్‌సెట్ క‌లిగి ఉంటుంది.

రియ‌ల్‌మీ నార్జో 70ప్రో 5జీ (Realme Narzo 70 Pro 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్‌తోపాటు 256 జీబీ స్టోరేజీ వ‌ర‌కూ ఆన్‌బోర్డ్ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. అద‌నంగా వ‌ర్చువ‌ల్‌గా 8 జీబీ ర్యామ్‌తో 16 జీబీ ర్యామ్ వ‌ర‌కూ పెంచుకోవ‌చ్చు. రియ‌ల్‌మీ నార్జో 70ప్రో 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియ‌ల్‌మీ యూఐ 5.1 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. మూడేండ్లు సాఫ్ట్‌వేర్‌, రెండేండ్ల‌కు పైగా ఎయిర్ సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది.

రియ‌ల్‌మీ నార్జో 70ప్రో 5జీ ఫోన్ (Realme Narzo 70 Pro 5G) ఫోన్ 1/1.56-అంగుళాల 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్‌890 ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా విత్ ఎఫ్‌/1.88 అపెర్చ‌ర్ అండ్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌) స‌పోర్ట్‌, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 1/3-అంగుళాల 16-మెగా పిక్సెల్ హైనిక్స్ హెచ్ఐ 1634 క్యూ సెన్స‌ర్ విత్ ఎఫ్‌/2.4 అపెర్చ‌ర్ ఉంటాయి.

67వాట్ల వైర్డ్ సూప‌ర్ వూక్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో రియ‌ల్‌మీ నార్జో 70ప్రో 5జీ (Realme Narzo 70 Pro 5G) ఫోన్ 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్ 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్‌-సీ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ కూడా జ‌త చేశారు.

Realme Narzo 70 Pro,Realme,Smartphone,5G smartphones