2024-04-15 04:57:44.0
Samsung Galaxy A34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) ఫోన్‌పై భారీగా ధర తగ్గించింది.
Samsung Galaxy A34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) ఫోన్‌పై భారీగా ధర తగ్గించింది. గతేడాది మార్చిలో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‌పై రూ.6000లకు పైగా డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది. దీనికి అదనంగా సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే ఆఫర్లు లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ34 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్వోసీ చిప్‌సెట్ (MediaTek Dimensity 1080 SoC)తో పని చేస్తుంది. ఈ ఫోన్‌కు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది.
శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ లాంచింగ్ ధర రూ.30,999 కాగా, ఇప్పుడు రూ.24,499లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.32,999 నుంచి రూ.6,500 తగ్గింపుతో రూ.26,499లకే కొనుగోలు చేయొచ్చు.
సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై రూ.4,073లకు నో-కాస్ట్ ఈఎంఐ, రూ.1,187లకు స్టాండర్డ్ ఈఎంఐ ఆప్షన్లు లభిస్తాయి. శాంసంగ్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులపై భారీగా కొనుగోలు చేసిన వారికి శాంసంగ్ అదనపు డిస్కౌంట్లు అందిస్తున్నది. ఈ ఏడాది ప్రారంభంలో శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‌పై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ.3,500 ప్రకటించింది. దీంతో శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్ రూ.27,499లకే లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) ఫోన్ సన్‌లైట్‌తో విజిబిలిటీ పెరుగుదలకు మద్దతుగా విజన్ బూస్టర్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.6- అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే విత్ ఫుల్ హెచ్‌డీ + రిజొల్యూషన్ కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తోందీ ఫోన్. 8 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీ కెపాసిటీని ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 48-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్, 5-మెగా పిక్సెల్స్ విత్ మాక్రో లెన్స్ కెమెరా సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటది.