2024-05-06 17:29:57.0
https://www.teluguglobal.com/h-upload/2023/02/14/723223-samyuktha-menon-1.webp
Samyuktha Menon – సంయుక్త మీనన్ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెల్లంకొండ సరసన నటించబోతోంది.
ప్రస్తుతం నిఖిల్ తో స్వయంభూ అనే సినిమా చేస్తోంది సంయుక్త మీనన్. ఈ సినిమాతో పాటు శర్వానంద్ సరసన కూడా ఓ సినిమా చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ దగ్గరకు మరో ప్రాజెక్టు వచ్చి చేరింది.
తాజా సమాచారం ప్రకారం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన ఓ సినిమాలో నటించబోతోంది సంయుక్త మీనన్. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా కోసం సంయుక్తను తీసుకోవాలని దాదాపు ఫిక్స్ అయ్యారు.
లైమ్ లైట్లో ఉన్న హీరోయిన్ ను తన సినిమాల్లోకి తీసుకోవాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాడు బెల్లంకొండ. గతంలో సమంత, రకుల్ లాంటి హీరోయిన్లతో నటించిన ఈ హీరో, ఇప్పుడు విరూపాక్ష ఫేమ్ సంయుక్తను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఇప్పటికే మేకర్స్, సంయుక్తతో చర్చలు జరిపారు. ఆమె కూడా నటించడానికి దాదాపు అంగీకరించింది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. వచ్చే నెలలో గ్రాండ్ గా లాంఛ్ చేసి, రెగ్యులర్ షూట్ కు వెళ్తారు. అప్పుడు మరిన్ని వివరాలు బయటకు రాబోతున్నాయి.
Samyuktha Menon,Bellamkonda Sai Srinivas,Moon Shine pictures