Santhana Prapthirasthu | కొత్త కాన్సెప్ట్ తో సంతాన ప్రాప్తిరస్తు

 

2024-05-19 08:42:32.0

https://www.teluguglobal.com/h-upload/2024/05/19/1328842-santhana-praptirasthu.webp

Santhana Prapthirasthu – నిర్మాత మధుర శ్రీధర్ మరో డిఫరెంట్ మూవీ రెడీ చేస్తున్నాడు. అతడు నిర్మిస్తున్న సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమా తాజాగా లాంఛ్ అయింది.

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా సంతాన ప్రాప్తిరస్తు సినిమా హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మధుర శ్రీధర్ నుంచి సినిమాలొచ్చి చాలా కాలమైంది. మళ్లీ ఇన్నాళ్లకు అతడి నుంచి మరో క్లీన్ మూవీ వస్తోంది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నాడు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సంతాన ప్రాప్తిరస్తు సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత, వ్యాపారవేత్త అంబికా కృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా…వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట రామరాజు క్లాప్ నిచ్చారు. మధుర శ్రీధర్ రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఇద్దరు ప్రొడ్యూసర్స్ స్క్రిప్ట్ ను దర్శకుడు సంజీవ్ రెడ్డికి అందజేశారు.

వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి మధ్య నడిచే కథతో ఈ సినిమా వస్తోంది. కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే ఓ సమస్యను వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం ఈ సినిమాకు హైలెట్ అవుతుందంటున్నాడు నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి. 

 

Madhura Sridhar,Santhana Prapthirasthu,Madhura Sridhar Reddy,Vikranth,Chandini Chowdary