Saripodhaa Sanivaaram | నాని పాటల హంగామా మొదలు

 

2024-06-16 07:08:25.0

https://www.teluguglobal.com/h-upload/2024/06/16/1336919-nani-saripodhaa-1.webp

Saripodhaa Sanivaaram – నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా పాటల ప్రచారం మొదలైంది.

నాని తన సినిమా కథలపై ఎంత ఫోకస్ పెడతాడో.. పాటలపై కూడా అంతే ఫోకస్ పెడతాడు. నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో మరో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. దాని పేరు సరిపోదా శనివారం. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా పాటల ప్రచారం మొదలైంది. ఫస్ట్ సింగిల్ ‘గరం-గరం’ లిరికల్ వీడియోను లాంచ్ చేశారు. విశాల్ దల్దానీ ఈ పాటను అద్భుతంగా పాడారు. సహపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ రాశాడు. నాని క్యారెక్టర్ ఎలాంటిదో ఈ లిరిక్స్ వింటే అర్థమౌతుంది. ఈ పాట యూత్ కు బాగా నచ్చేలా ఉంది.

చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. మురళి జి డివోపీగా పని చేస్తున్నాడు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

 

Nani,Saripodhaa Sanivaaram,First Song,Priyanka Mohan