Shivam Bhaje | శివం భజే ట్రయిలర్ రిలీజ్

 

2024-07-23 17:17:05.0

https://www.teluguglobal.com/h-upload/2024/05/11/1326917-shivam-bhaje-1.webp

Shivam Bhaje – అశ్విన్ బాబు తాజా చిత్రం శివం భజే. ఈ సినిమా ట్రయిలర్, విశ్వక్ సేన్ చేతులమీదుగా రిలీజైంది.

‘ఆట మొదలెట్టావా శంకరా’.. ‘నీ వెనకుండి నడిపిస్తున్న ఆ గుంటనక్క గురించి కూడా తెలుసురా నా కొడకా’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్‌తో శివం భజే ట్రైలర్‌లో విశ్వరూపం చూపించాడు అశ్విన్ బాబు.

గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శివం భజే’ ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతోందని ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ చూస్తే అర్థం అవుతుంది.

ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. విశ్వక్ సేన్, తమన్, అనిల్ రావిపూడి లాంటి ప్రముఖుల సమక్షంలో శివం భజే ట్రయిలర్ గ్రాండ్ గా రిలీజైంది. టీజర్ లో హీరో అశ్విన్ కి ఏదో మానసిక సమస్య ఉన్నట్టు బ్రహ్మాజీ, హైపర్ ఆది లతో చెప్పే సీన్ పెట్టారు. దానికి కొనసాగింపుగా ట్రయిలర్ లో కొన్ని సన్నివేశాలు చూపించారు. దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా ఓ ప్రమాదం జరగడం.. ఇన్వెస్టిగేషన్ లో బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, సాయి ధీన వంటి పలువురు నటులు నిమగ్నమై ఉండడం, అయ్యప్ప శర్మ ద్వారా వీటన్నిటి వెనక దైవం ఉనికి ఉందని తెలియజేయడం ట్రయిలర్ లో ఆకట్టుకున్నాయి.

ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, అయ్యప్ప శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్ వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

 

Ashwin Babu,Shivam Bhaje,Shivam Bhaje Trailer