Shruti Haasan | సింగిల్ గా శృతిహాసన్

 

2024-05-01 08:54:01.0

https://www.teluguglobal.com/h-upload/2023/04/30/734394-shruti-haasan-1.webp

Shruti Haasan – బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయినట్టు కథనాలు వస్తున్నాయి. దాన్ని మరింత నిజం చేస్తూ పోస్టులు పెడుతోంది శృతిహాసన్.

శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ నుంచి విడిపోయినట్టు ఈమధ్య తరచుగా వార్తలొస్తున్నాయి. వాటికి మరింత బలం చేకూర్చేలా వ్యవహరిస్తోంది ఈ హీరోయిన్. తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టింది. అందులో “ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది” అంటూ స్పందించింది. అంతేకాదు, ఇక నా ప్రపంచం కుటుంబమే అనే అర్థం వచ్చేలా కామెంట్ జతచేసింది.

ఇవన్నీ చూస్తుంటే, శృతిహాసన్ నిజంగానే బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా నుంచి విడిపోయినట్టు కనిపిస్తోంది. పైగా గతంలో హజారికాతో గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన జ్ఞాపకాలన్నింటినీ ఆమె ఇనస్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసింది.

లండన్ కు చెందిన ఓ నటుడితో కొన్నాళ్లు డేటింగ్ చేసింది శృతిహాసన్. అయితే అతడితో ఎక్కువ రోజులు ఈమె ప్రేమాయణం సాగలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు శాంతనూకు దగ్గరైంది. కరోనా టైమ్ లో ఇద్దరూ కలిసి ఒకే అపార్ట్ మెంట్ కు షిఫ్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడుతూ వచ్చారు.

ఈమధ్య ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు వచ్చినట్టున్నాయి. దీంతో శృతిహాసన్, అతడికి దూరమైనట్టు కథనాలు వస్తున్నాయి. అటు శాంతనూ కూడా శృతిహాసన్ ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

 

Shruti Haasan,Break Up,Hazarika