Simbaa Movie | అనసూయ, జగపతిబాబు జంటగా శింబ

 

2024-07-24 16:17:43.0

https://www.teluguglobal.com/h-upload/2024/07/24/1346940-simbaa.webp

Simbaa Movie Trailer – జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా శింబా. ఈ మూవీ ట్రయిలర్ రిలీజైంది.

“ప్రపంచంలో రోజూ జరుగుతున్న మరణాల్లో, 65 శాతం మంది వాయు కాలుష్యం వల్ల చనిపోతున్నారు. అంటే.. దమ్ము, మందు కంటే.. దుమ్ము వల్ల చనిపోతున్న వాళ్లు పాతిక రెట్లు ఎక్కువ. వస్తువులు మనతో మాత్రమే ఉంటాయి.. కానీ మొక్కలు మనతోనే ఉంటాయి..మనతో పాటు పెరుగుతాయి.. మన తరువాత కూడా ఉంటాయి” అంటూ అద్భుతమైన డైలాగ్స్‌తో సాగిన సింబా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు.

ట్రయిలర్ లాంఛ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన అనసూయ.. సినిమా జానర్ ను బయటపెట్టింది.

“వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పర్యావరణాన్ని మనం ఎలా పాడు చేస్తున్నామో.. దానికి ఎలాంటి పర్యవసనాలను చూస్తున్నామో అందరికీ తెలిసిందే. సింబా చాలా మంచి కాన్సెప్ట్‌తో రాబోతోంది. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతోంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. జగపతి బాబు గారు ఈ చిత్రానికి ప్రధాన బలం.”

ఆగస్ట్ 9న సింబా సినిమా థియేటర్లలోకి వస్తోంది. కృష్ణ సౌరభ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

 

Simbaa Movie,Simbaa Trailer,Jagapathi Babu,Anasuya